Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బహుముఖ ప్రజ్ఞాశాలి నారాయణరావు ఇక లేరు

బహుముఖ ప్రజ్ఞాశాలి నారాయణరావు ఇక లేరు

Gulte.com 3 weeks ago

ప్రముఖ నటులు నారాయణరావు కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న చివరి శ్వాస తీసుకున్నారు. 1976 కె బాలచందర్ 'అంతులేని కథ'తో తెరంగేట్రం చేసిన నారాయణరావు డెబ్యూతోనే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

మరుసటి ఏడాది ‘ఒక ఊరి కథ’తో స్పెషల్ జ్యురి పురస్కారం అందుకోవడం అప్పట్లో సంచలనం. కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, దేవదాస్ కనకాలతో కెరీర్ ప్రారంభంలో నాటకాలు వేసేవాళ్ళు.

మద్రాస్ ఫిలిం ఇన్స్ టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న టైంలో చిరంజీవితో స్నేహం వీళ్ళిద్దరిని మరింత దగ్గర చేసింది. రజినీకాంత్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గుప్పెడు మనసు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, మంచుపల్లకి, బహుదూరపు బాటసారి లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నారాయణరావు భాగం పంచుకున్నారు. మిత్రుడు చిరంజీవి హీరోగా ఆయన నిర్మించిన ‘దేవాంతకుడు’ కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది.

1988లో ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న చిరంజీవి నారాయణరావుతో పాటు సుధాకర్, హరిబాబుని భాగస్వాములుగా ‘యముడికి మొగుడు’లో నటించారు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. సుమారు వందకు పైగా చిత్రాల్లో నటించిన నారాయణరావుకు ‘గ్యాంగ్ లీడర్’ లాంటివి మంచి బ్రేక్ ఇచ్చాయి. పసుపు కుంకుమ, గిరిజ కళ్యాణం, సుందరకాండ, గీతాంజలి లాంటి టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకున్నారు. నిరాడంబరుడు, సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్నారు.

పలు సందర్భాల్లో నారాయణరావు తను నటుడిగా ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పేవారు. ఇతర ఆర్టిస్టుల్లా వందల సినిమాలు చేయనప్పటికీ ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ తనకు ఎంత ఆప్త మిత్రుడు అయినా ఆ అవకాశాన్ని ఏనాడూ వాడుకునే ప్రయత్నం చేసేవారు కాదు. ఈయన చివరి సినిమా ఆలోచన త్వరలో విడుదల కానుంది. 73 సంవత్సరాల వయసులో నారాయణరావుగారు భౌతికంగా దూరమైనా సినిమాల్లో జీవించే ఉంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu