Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండ్ల గణేష్ ఇంటి వేడుకలో త్రివిక్రమ్

బండ్ల గణేష్ ఇంటి వేడుకలో త్రివిక్రమ్

Gulte.com 3 hrs ago

ర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు చాలా దగ్గరైన మిత్రులే. కానీ ఈ ఇద్దరికీ విడిగా అంత మంచి సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే.

తనను పవన్‌కు దూరం చేస్తున్నాడంటూ బండ్ల మీద ఒక దశలో చాలా ఆగ్రహంతో ఉన్నాడు బండ్ల. ఇదే విషయమై ఒక సందర్భంలో పవన్ అభిమానితో ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ త్రివిక్రమ్‌ను బూతులు తిట్టడం.. లీకైన ఆ ఆడియో సంచలనం రేపడం గుర్తుండే ఉంటుంది.

ఐతే ఆ ఆడియో తనది కాదు అంటూ మాట మార్చకుండా మరో సందర్భంలో త్రివిక్రమ్‌కు సారీ చెప్పాడు కానీ ఆ తర్వాత కూడా ఆయనతో పెద్దగా సన్నిహితంగా మెలిగింది లేదు. కానీ ఇటీవల త్రివిక్రమ్‌తో గ్యాప్ తగ్గంచుకునే ప్రయత్నం గట్టిగానే చేశాడు బండ్ల. త్రివిక్రమ్‌ను కొనియాడుతూ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గుర్తుండే ఉంటుంది. అలాగే తన కూతురు పెళ్లికి మాటల మాంత్రికుడిని ఆహ్వానించాడు.

త్రివిక్రమ్ కూడా పాత విషయాలను మనసులో పెట్టుకోకుండా బండ్ల ఇంటి వేడుకకు హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి ఎంతోమంది అతిరథ మహారథులు హాజరయ్యారు. అందులో త్రివిక్రమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద బొకేతో వచ్చిన ఆయన వధూవరులకు అందించి ఆశీర్వాదాలు అందించారు. బండ్లతో కరచాలనం చేశాక ఫొటో కోసం అడుగుతుంటే ఏం పర్వాలేదని పక్కకు తప్పుకున్నారు త్రివిక్రమ్.

ఎన్నో ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ ఇలా కెమెరాల కంట పడడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య గొడవ సమసిపోయినట్లేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'టెంపర్' తర్వాత సినిమాలు నిర్మించని బండ్ల.. కొన్నేళ్ల నుంచి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ సినిమాతో పునరాగమనం చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. ఐతే తన పెద్ద కొడుకు హితేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ పెద్ద దర్శకుడితో చేయబోయే సినిమాతో ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu