Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం వదిలేసిన టోవినో థామస్

బంగారం వదిలేసిన టోవినో థామస్

Gulte.com 4 days ago

నిన్న విడుదలైన డ్రాగన్ టీజర్ లో పాత్రల పరిచయం, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో అన్నీ చూపించేశారు. ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ఎన్ని శక్తులు ఉంటాయనేది స్పష్టంగా పేర్లతో సహా చెప్పేశారు.

హీరో, విలన్లను పట్టుకునే ఆఫీసర్ గా అనిల్ కపూర్ గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటుంది. టోవినో థామస్ వదిలేసిన క్యారెక్టర్ ఏది అని. దానికి సమాధానం కొంచెం డీటెయిల్డ్ గా చూస్తే అర్థమవుతుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ భారతదేశానికి ఓవైపు ఉండే ఆఫ్ఘన్ డాన్స్ చూపించాడు కానీ ఇంకోపక్క ఉండే గోల్డెన్ ట్రయాంగిల్ ని ఎవరు శాశిస్తారనేది చూపించలేదు. అంటే అసలు విలన్ అక్కడ ఉంటాడన్న మాట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టోవినో వదిలేసింది ఇదేనట. తారక్ తో సమానంగా వెయిట్ ఉండే ఈ పాత్ర కోసం చాలా ఆప్షన్లు పరిశీలించారు. దాని డెప్త్ తెలిసే టోవినో థామస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ బల్క్ డేట్లు ఇవ్వలేక వదిలేసుకున్నారు.

ఇప్పుడీ గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ ఎవరనేది తేలాల్సి ఉంటుంది. వివేక్ ఒబెరాయ్ తో పాటు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ప్రశాంత్ నీల్ ఎవరిని ఫైనల్ చేస్తాడనేది వేచి చూడాలి. సలార్ లో పృథ్విరాజ్ సుకుమారన్, కెజిఎఫ్ లో సంజయ్ దత్ వాటికి ఎంత బలమయ్యారో తెలిసిందే. అంతకు మించిన స్థాయిలో ఉండే డ్రాగన్ విలన్ గా ఆషామాషీ వ్యక్తి సరిపోడు. ఇమేజ్ పరంగా చాలా బలంగా ఉన్న నటుడు కావాలి. అందుకే ఇంత వేట.

ఇంకొన్ని వారాల్లో అదేంటో తేలుతుంది. యూనిట్ లో వినిపిస్తున్న దాని ప్రకారం డ్రాగన్ 1లో ఆఫ్ఘన్ మాఫియా ఉంటే రెండో భాగంలో రెండు వర్గాల మధ్య భీకరమైన యుద్ధం నేపధ్యంగా ఓపియం వార్ ఉంటుందట. ఇది చాలా కీలకం కాబట్టి దానికి తగ్గ యాక్టర్ కోసం ప్రశాంత్ నీల్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ లో పార్ట్ 1, డిసెంబర్ లో పార్ట్ 2 రిలీజ్ కావడం దాదాపు ఖాయమే. ఏదైనా ఆలస్యాలు, అనుకోని అడ్డంకులు వస్తే తప్ప ఈ ప్లాన్ లో ఎలాంటి మార్పులు ఉండవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu