Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు

భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు

Gulte.com 1 week ago

బాలికపై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భగీరథ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు .. తెలంగాణ పోలీసులు..

వైమానిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లుకౌట్‌(కనిపిస్తే.. పట్టేయండి) నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు అయింది.

మరోవైపు.. భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఏక్షణమైనా.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు.

మరోవైపు.. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు భగీరథ్ కోసం గాలిస్తున్నారు. ఆయన ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని అధికారులు చెబుతున్నారు. అతని నివాసంలోనూ.. పోలీసులు తనిఖీలు చేయడం గమనార్హం.

దీనికి సంబంధించి కోర్టు వారెంటు కూడా తీసుకున్నారు. కాగా.. ప్రస్తుతం భగీరథ్ కారు డ్రైవర్ నుంచి స్నేహితుల వరకు దాదాపు 30-50 మంది కరీంనగర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu