Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భలే. పెద్దికి అండగా హోంబాలే

భలే. పెద్దికి అండగా హోంబాలే

Gulte.com 1 week ago

పెద్దికి పెద్ద చేతులు కలిసి వస్తున్నాయి. ఒకపక్క తెలంగాణ సింగల్ స్క్రీన్ల గొడవ వల్ల ఎక్కడ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయోనని టెన్షన్ పడుతున్న అభిమానులకు ఓవర్ సీస్ పరిణామాలు కొంత రిలీఫ్ దక్కిస్తున్నాయి.

కెజిఎఫ్, కాంతార లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ విదేశాల పంపిణీ హక్కులను ప్రపంచవ్యాప్తంగా తీసుకుంది. నార్త్ అమెరికా మినహాయించి అన్ని చోట్ల తమ సంస్థ ద్వారా మొదటిసారి ఒక పెద్ద మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఇది పెద్దికి చాలా ప్లస్ కానుంది. ఎందుకంటే చేతిలో సమయం తక్కువగా ఉండటం వల్ల రిలీజ్ వ్యవహారాలు చూసుకునే బలమైన మద్దతు ఇప్పుడు చాలా అవసరం. పంతొమ్మిది రోజుల నిడివి చాలా టైట్ ఉంది. ప్రమోషన్లు వరుసగా ప్లాన్ చేశారు. ట్రైలర్ లాంచ్ తర్వాత ఇవి ఊపందుకోబోతున్నాయి. ఇక హోంబాలేకున్న నెట్ వర్క్ దృష్టా సరిపడా స్క్రీన్లు పెద్ది కోసం దొరుకుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఫ్యాన్స్ కోరుకునే విధంగానే రిలీజ్ ఉండనుంది.

మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. మూవీ లవర్స్ కూడా గత మూడు నెలలుగా తమను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిన సినిమా లేకపోవడంతో పెద్ది మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇక డిస్టిబ్యూటర్లు, బయ్యర్ల సంగతి సరేసరి. చాలా డల్లుగా ఉన్న బాక్సాఫీస్ కు ఉత్సాహాన్ని తెచ్చే బాధ్యత ప్రస్తుతం పెద్ది మీదే ఉంది. దానికి తగ్గట్టే ఏరియాల వారిగా డిమాండ్ పీక్స్ లో కనిపిస్తోంది. కొన్ని చోట్ల పుష్ప, ఆర్ఆర్ఆర్ రేట్లు దాటిపోయింది కూడా.

వరల్డ్ వైడ్ సరైన గ్రౌండ్ దొరకడంతో ఇక టాక్ తెచ్చుకోవడం ఒకటే మిగిలి ఉంది. దర్శకుడు బుచ్చిబాబు కాన్ఫిడెన్స్ చూస్తుంటే గురువు సుకుమార్ ని మించిపోయే ఫలితం ఇస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండు పాటలు ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయ్యాయి. టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్, ఐటెం సాంగ్ కూడా అంతే స్పందన తెచ్చుకుంటే చాలు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. రాబోయే రోజుల్లో ప్రతి అప్డేట్ చాలా కీలకం కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu