Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్లాక్‌బస్టర్ కాంబో.. మళ్లీ కొడతారా?

బ్లాక్‌బస్టర్ కాంబో.. మళ్లీ కొడతారా?

Gulte.com 6 days ago

మిళనాట విజయ్ సినీ రంగానికి దూరం కావడంతో ఇండస్ట్రీలో ఒక శూన్యత ఆవహించిన పరిస్థితి. రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వయసు మీద పడడం.. అజిత్ ఇంతకుముందులా ఉత్సాహంగా సినిమాలు చేయకపోవడంతో టాప్ లీగ్‌లోకి వెళ్లడానికి తర్వాతి రేంజ్ హీరోలకు ఇప్పుడో మంచి అవకాశం దక్కింది.

గత కొన్నేళ్లలో చాలా వేగంగా మార్కెట్‌ను పెంచుకున్న హీరోల్లో శివకార్తికేయన్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

ముఖ్యంగా 'అమరన్' సినిమా తన రేంజిని అమాంతం పెంచింది. ఆ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. దాని తర్వాత శివ నుంచి వచ్చిన 'పరాశక్తి' సరిగా ఆడకపోయినా.. అతడి మార్కెట్‌ ఏమీ పడిపోలేదు. ఇప్పుడు శివ చేయబోతున్న 'సెయాన్' సినిమాతో 'అమరన్' స్థాయి హిట్ కొడితే.. అతను ఇంకా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయం. 'అమరన్' సినిమాను నిర్మించిన కమల్ హాసనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం.

విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన 'సెయాన్' ఈ రోజే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కాంబినేషన్లన్నీ చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన 'తాయ్ కిళవి' అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం.

'తాయ్ కిళవి'తో శివకుమార్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడు శివకార్తికేయన్ లాంటి టాలెంటెడ్ హీరోతో సినిమా చేస్తుండడం.. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండడం విశేషం.

తన తొలి నాలుగు చిత్రాలు ఫ్లాపైనా తనకు అవకాశాలేమీ ఆగట్లేదు. తమిళంలోనూ ఆమె 'కాంత'తో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకుంది. కానీ అందులో భాగ్యశ్రీ కెరీర్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె జస్ట్ అందగత్తె కాదని, మంచి పెర్ఫామర్ అని ఈ సినిమాతో రుజువైంది. ఆ టాలెంట్ చూసే శివకార్తికేయన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu