Dailyhunt
బ్రో దర్శకుడి సినిమాకు చప్పుడు లేదు

బ్రో దర్శకుడి సినిమాకు చప్పుడు లేదు

Gulte.com 3 weeks ago

వాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన సంగతే సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు.

మనకు బాగా పరిచయమున్న నటుడు, పవన్ కళ్యాణ్ బ్రో దర్శకుడు సముతిరఖని హీరోగా రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు రామ్ చక్రి దర్శకత్వం వహించారు. దీని కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేశారు. ప్రెస్ మీట్లు నిర్వహించి కాస్తో కూస్తో సౌండ్ చేశారు.

కానీ కార్మేని సెల్వంని మన జనాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. బ్యాడ్ మూవీ కాదు కానీ ఇంత బరువైన భావోద్వేగాలు అది కూడా తమిళ ఆర్టిస్టులతో చూడాలంటే టాలీవుడ్ ఆడియన్స్ కు కొంచెం కష్టమే. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఒక కారు డ్రైవర్ డబ్బు, స్వంత ఇల్లు కోసం ఎలాంటి అగచాట్లు పడ్డాడు, చివరికి అతని ప్రయాణం చెన్నై నుంచి దుబాయ్ దాకా ఎలా జరిగింది అనేది ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు.

ఎంత సమర్ధించుకున్నా డబ్బింగ్ సినిమాల నిర్మాతలు తమిళ మలయాళ పేర్లను యధాతథంగా ఉంచి తప్పు చేస్తున్నారు. రజనీకాంత్ అంతటి సూపర్ స్టార్ మూవీకి వెట్టయన్ అని పెడితే మన జనాలు ఆదరించలేదు. అలాంటిది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన వాటికి కనీసం నేటివిటీ కోసమైనా పేర్లు మార్చాలన్న స్పృహ లేదు. కార్మేని సెల్వం బదులు కాచిగూడ సూరి అని పెట్టినా కనీసం కాసింత జనం కనిపించేవారు. కార్మేని సెల్వం పేరు దగ్గరే కనెక్టివిటీ పోయింది.

ఇకనైనా ఈ ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఎంత తెలుగు ప్రేక్షకులది పెద్ద మనసు అయినా మరీ ఇంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. పల్లి చట్టంబి విషయంలో కూడా టోవినో థామస్ ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆయన చెప్పిన బాహుబలి లాజిక్ ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేదు. బిసి సెంటర్లలో జనాలు రావాలంటే టైటిల్ ఎంత ముఖ్యమో ప్రొడ్యూసర్లు గుర్తించే వరకు ఇలాంటివి కనీస ఓపెనింగ్స్ కి కూడా నోచుకోలేవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu