Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

Gulte.com 1 week ago

ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.

ఈ కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ బహీరాబాద్ పోలీసులు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు భగీరథ్ కు నోటీసులు జారీ చేశారు.

అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని వాదించిన భగీరథ్, ఆయన కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించిన పలు వివరాలను న్యాయవాదుల ఎదుట పెట్టి కేసును సమగ్రంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసు విచారణకు హాజరయ్యే విషయంలో భగీరథ్ ఒకింత జాప్యం చేశారు.

అయితే కేసు తీవ్రమైనదైనా పోలీసుల విచారణకు భగీరథ్ హాజరు కాని నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్టుగా పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా పోలీసుల నోటీసుల గడువు ముగిసి వారం రోజులు కావస్తున్న నేపథ్యంలో భగీరథ్ శనివారం రాత్రి లొంగిపోయారు.

ఈ సందర్భంగా ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు భగీరథ్ ను రెండు గంటల పాటు విచారించారు. అనంతరం ఆయనకు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత న్యాయమర్తి ఎదుట హాజరుపరిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu