Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దారుణం. సినిమా ఆశ చూపి లైంగిక దాడి

దారుణం. సినిమా ఆశ చూపి లైంగిక దాడి

Gulte.com 5 days ago

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్‌లోని గదికి తీసుకెళ్లి రెండు రోజులు లైంగిక దాడి చేశారు.

ఈ నెల 16న ఒక యువతిని ర్యాపిడోలో పంపించేశారు. ఒంటిపై గాయాలతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి వార్తలు కొత్త కాదు. టీవీల్లో, పేపర్లలో ప్రతి నెలా ఒకటి రెండు కేసులు వస్తున్నాయి.

మోసపోవడానికి అసలు కారణం సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న గుడ్డి నమ్మకం అని తెలుస్తోంది. చాలా మందికి ఇది ఒక్క రాత్రిలో జీవితం మార్చే రంగం అనే భ్రమ ఉంది. గ్లామర్, డబ్బు, ఫేమ్ తొందరగా వస్తాయి అనుకుంటారు. ఆ భ్రమను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ పిలుస్తున్నాడు, రేపే ఆడిషన్.. అని చెప్పగానే ఎదురు ప్రశ్నలు వేయకుండా నమ్మేస్తున్నారు. నిజమైన కాస్టింగ్ ఎలా జరుగుతుందో తెలియని అమాయకత్వం వాళ్లను బలి చేస్తోంది.

ఇక సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా ఈజీగా ట్రాప్ లో పడుతున్నారు. ఈ ఘటనలో బాధితులు అనాథ యువతులు. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ దగ్గర నివాసం ఉంటున్నారు. కుటుంబం, స్నేహితుల సలహా తీసుకునే అవకాశం లేదు. ఎవరైనా 'అవకాశం ఇస్తా' అంటే అదే ప్రపంచం అనుకుంటారు. పేదరికం, ఒంటరితనం వాళ్లను మరింత బలహీనంగా మారుస్తుంది. మోసగాళ్లు కావాలనే అలాంటి వాళ్లనే టార్గెట్ చేస్తారు.

ఇక మోసపోయిన తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్తే పరువు పోతుంది అని చాలామంది మౌనంగా ఉండిపోతారు. ఈ కేసులో యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేయబట్టే విషయం బయటకు వచ్చింది. లేదంటే ఆ నిందితులు మరికొందరిని ఇలాగే మోసం చేసేవారని స్థానికులు చెబుతున్నారు.

బాధితులు ముందుకు రాకపోవడం వల్లే ఈ నేరాలు రిపీట్ అవుతున్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పేరు చెప్పి మోసం చేయడం ఇప్పుడు ఒక ప్యాటర్న్ అయిపోయింది. నిజమైన ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడూ వాట్సాప్‌లో, రాత్రిపూట, హోటల్ గదుల్లో ఆడిషన్స్ పెట్టదు. అధికారిక మెయిల్, ఆఫీస్ అడ్రస్, టీమ్ సమక్షంలోనే ప్రాసెస్ ఉంటుంది. డబ్బులు అడగడం, ఒంటరిగా రమ్మనడం చేస్తే అది 100% మోసం. ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది బుక్కైపోతున్నారని అర్ధమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu