Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

Gulte.com 2 weeks ago

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం పాటు పడుతున్న మోదీని అనకూడని మాటలు అంటుంటే నా గుండె కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంతో సాగింది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం, బంగారం అమ్ముకున్న దశలో పగ్గాలు చేబట్టి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానికి ఇదా మనం ఇచ్చే బహుమతి అని ప్రశ్నించారు. ఆయన మీద మాట పడితే మా మీద పడినట్లే స్పష్టం చేశారు . ఎంత దూషించినా పట్టించుకోకుండా తిట్టిన వాళ్ళను సైతం క్షమించిన పెద్ద మనసు కలిగిన మోదీకి పాదాభివందనాలు చేస్తున్నాను అన్నారు.

పవన్ ఇంకా ఏమన్నారంటే..

పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సంస్కారం నేర్పించడం చాలా అవసరమని తల్లీదండ్రులకు సూచించారు. ఒక కుటుంబాన్ని నడపడానికి కష్ట పడుతున్న మనకు 147కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద దేశాన్ని నడపడం ఎంత కష్టమో ఆలోచించాలని సూచించారు.

పవన్ ప్రసంగానికి విశేష స్పందన…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జంతర్ మంతర్లో విద్యార్థుల దూషణలను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం వీడియా విడుదల చేసిన నేపథ్యంలో అదే విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం గమనార్హం. భోగాపురం విమానాశ్రయం గురించి ప్రస్థావించినప్పటికీ జంతర్ మంతర్ దూషణలపైనే ఎక్కువగా మాట్లాడ్డం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu