Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశంలో ఒకే ఒక్కడు. మోడీ రికార్డ్‌!!

దేశంలో ఒకే ఒక్కడు. మోడీ రికార్డ్‌!!

Gulte.com 3 days ago

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఆయన తిరగరాశారు.

దేశంలో ఒక్క ఒక్కడుగా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిర పేరిట ఉన్న రికార్డును కొన్నాళ్ల కిందట అధిగమించిన మోడీ.. ప్రస్తుతం ఆమె తండ్రి, భారత తొలిప్రధాన మంత్రి చాచా నెహ్రూను కూడా పాలనలో అధిగమించారు. దేశానికి ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడిగా మోడీ సంచలన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఈ నెల 10వ తేదీ నాటికి.. మోడీ.. దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసి నేత చరిత్ర సృష్టించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇప్పటి వరకు నిరాఘాటంగా ఆ పదవిలోనే ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తగా బీజేపీ ప్రభంజనం సృష్టించి.. మోడీ ప్రధాని అయ్యే అవకాశం కల్పించింది. ఇక, 2024లో బీజేపీకి ఒంటరిగా సీట్లు తగ్గినప్పటికీ.. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జనసేన సహా.. అనేక చిన్నా చితకా పార్టీల మద్దతుతో మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అలంకరించారు.

ఇదీ పరంపర..

  • గతంలోనూ మూడు సార్లు ప్రధాని అయిన వారు ఉన్నా.. వరుసగా.. ప్రధాని కావడం, సుదీర్ఘకాలం వరుసగా పాలన సాగించే విషయాల్లో మోడీనే ఫస్ట్ నిలిచారు. 2014, మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ నెల 10వ తేదీ నాటికి వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. ఇది దేశంలోనే అత్యధిక రికార్డు.
  • 1952.. మే 13న దేశ తొలి ప్రధానిగా నెహ్రూ ప్రమాణం చేశారు. ఆయన 1964, మే 27న మరణించే వరకు వరుసగా 4,398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోడీ తోసిపుచ్చి.. తానే సరికొత్త రికార్డును సృష్టించారు. జూన్ 10వ తేదీ నాటికి మోడీ 4,399 రోజులపాటు వరుసగా పీఎం సీటులో కూర్చున్న ఏకైక నేతగా నిలిచారు.
  • ఇక, ఇందిరమ్మ విషయానికి వస్తే.. మధ్యలో ఓడినా.. మొత్తంగా 4077 రోజుల పాటు భారత దేశానికి ఏకైక మహిళా ప్రధానిగా పనిచేశారు. అయితే.. ఈ రికార్డును గత ఏడాదే మోడీ అధిగమించారు. 2025, జులై 25న 4,078 రోజుల నిరంతరాయ పాలన రికార్డును మోడీ నమోదు చేయడం గమనార్హం. దీంతో ఈ నెల 10న దేశవ్యాప్తంగా సంబరాలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇదిలావుంటే.. మోడీ సాధించిన ఈ రికార్డును అధిగమించే పరిస్థితి కనుచూపు మేరలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu