Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోని పేరు చెప్పి మోసం చేశారా?

ధోని పేరు చెప్పి మోసం చేశారా?

Gulte.com 4 days ago

లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కొన్నేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. 2022, 2023 సీజన్లలోనే అతను ఆట నుంచి వైదొలుగుతాడని వార్తలు వచ్చాయి.

కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఒక్కో సీజన్ పొడిగించుకుంటూ 2026 ఐపీఎల్‌కు కూడా రెడీ అయిపోయాడు ధోని. కానీ మరి కొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం కాబోతుండగా.. అతడి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాకిచ్చింది. గాయంతో ధోని రెండు వారాలు దూరం అవుతున్నాడని చెప్పింది.

ఐతే లీగ్‌లో రెండు వారాలు పూర్తయ్యాయి. నాలుగు వారాలు అయ్యాయి. ఆరేడు వారాలు గడిచాక కూడా ధోని అందుబాటులోకి రాలేదు. కానీ అతడి ఫిట్‌నెస్ విషయంలో ఏ దశలోనూ సీఎస్కే అప్‌ డేట్ ఇవ్వలేదు. ఫలానా మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు అన్నది స్పష్టం చేయలేదు. సందిగ్ధతను అలాగే కొనసాగించింది.

అభిమానులు తర్వాతి మ్యాచ్‌కు ధోని వచ్చేస్తాడు అనుకుని ఆశగా టికెట్లు కొనడం.. చివరికి ధోని మ్యాచ్‌లో కనిపించకపోవడం.. ఇదీ వరస.

ఐపీఎల్‌లో అత్యంత డిమాండ్, ఆకర్షణ ఉన్న జట్లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. అదంతా ధోని పుణ్యమే. సీఎస్కే బ్రాండ్ వాల్యూ అంతా ధోని మీదే ఆధారపడి ఉంది. అతను వెళ్లిపోతే బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. సీఎస్కే ఆదరణ తగ్గిపోతుంది. ఈ విషయం తెలిసే యాజమాన్యం.. ధోని విషయంలో క్లారిటీ ఇవ్వకుండా గేమ్ నడిపిస్తోందన్నది స్పష్టం.

ధోని తర్వాతి మ్యాచ్‌కు వస్తాడేమో అని మీడియా, సోషల్ మీడియా ద్వారా లీక్స్ ఇవ్వడం.. దాని ఆధారంగా చెన్నై మ్యాచ్‌లకు టికెట్ల ధరలు పెంచి అమ్మడం.. జనాలు పిచ్చోళ్ల లాగా ఎగబడి కొనడం.. స్టేడియాలను నింపేయడం.. చివరికి చూస్తే ధోని ఆడకపోవడం.. ఈ సీజన్ అంతా ఇదే వరస.

తాజాగా చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోని కచ్చితంగా ఆడతాడని బజ్ క్రియేట్ చేశారు. దీంతో డిమాండ్ మామూలుగా లేదు. చివరికి చూస్తే ధోని మైదానంలో కనిపించాడు కానీ.. ఆడలేదు. దీంతో మళ్లీ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు.

అసలు ఈ సీజన్లో ఆడే ఉద్దేశం ధోనికి ఉందా అన్నది ప్రశ్నార్థకం. తనకు ఫిట్‌నెస్ లేదని, వయసు మీద పడిందని, ఇక రిటైర్మెంట్ తీసుకుంటానని ఫ్రాంఛైజీకి ముందే ధోని హింట్ ఇచ్చి ఉంటాడని.. అతను లేడంటే టికెట్లు తెగవని, తమ జట్టుకు క్రేజ్ ఉండదని సీఎస్కే యాజమాన్యం విషయం బయటపెట్టకుండా జనాలను మోసం చేస్తూ గేమ్ నడిపించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu