Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిజిటల్ దురంధర్. ఇది నిజంగా బ్లండర్

డిజిటల్ దురంధర్. ఇది నిజంగా బ్లండర్

Gulte.com 1 week ago

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించిన దురంధర్ ది రివెంజ్ ఇటీవలే ఇండియా మినహాయించి మిగిలిన ప్రపంచంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలయ్యింది. మన దేశంలో హాట్ స్టార్ లో జూన్ 4 నుంచి అందుబాటులో రానుంది.

అదే ప్లాట్ ఫార్మ్ లో ఐపీఎల్ వస్తున్న నేపథ్యంలో అది ముగిశాక స్ట్రీమింగ్ చేస్తే వ్యూస్ విడిపోవనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ముంబై వర్గాల కథనం. అయితే ఇదే రివర్స్ లో బూమరాంగ్ అవుతోందని చెప్పక తప్పదు.

ఎందుకంటే దురంధర్ ది రివెంజ్ కు ఇతర దేశాల్లో భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ రిలీజ్ నిషేధించిన పాకిస్థాన్ లో ఓటిటిలో వచ్చిన మొదటి రోజు సర్వర్లు క్రాష్ అయ్యే రేంజ్ లో ఒక్కసారిగా జనం నెట్ ఫ్లిక్స్ మీద పడ్డారని ఒక వ్లాగర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బయట పైరసీ రూపంలో ఒక కాపీని 50 నుంచి 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. దురంధర్ మొదటి భాగానికి కూడా ఇలాగే చేశారు.

ఇక మనోళ్ల విషయానికి వస్తే జూన్ 4 దాకా ఆగలేకపోతున్న కొందరు పైరసీ మార్గాల ద్వారా హెచ్డి ప్రింట్ చూసేస్తున్నారు. దీన్ని కట్టడి చేసే వ్యవస్థ ఇక్కడ బలహీనంగా ఉండటంతో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అదేదో హాట్ స్టార్ ఈ టైంలోనే విడుదల చేసి ఉంటే మిలియన్ల వ్యూస్ వెల్లువల్గా వచ్చి పడేవి. అయినా ఐపీఎల్ మ్యాచులు అత్యధిక శాతం సాయంత్రం పూటే జరుగుతున్నాయి. మిగిలిన టైంలో ఆడియన్స్ కి మరో ఛాయస్ కావాలి కదా.

ఏది ఏమైనా దురంధర్ ది రివెంజ్ యాభై రోజులకు కూడా టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలవడం విశేషం. రెండు వేల కోట్ల మార్కుని అందుకోలేకపోయినా ఇప్పుడు సాధించిన విజయం చిన్నది కాదు. బాలీవుడ్ స్పై సినిమాలను చూపించే విధానాన్ని సమూలంగా మార్చేసిన దురంధర్ నుంచి మూడో భాగం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. దర్శకుడు ఆదిత్య దార్ కొనసాగింపు మీద ఆసక్తిగా లేనప్పటికీ నిర్మాతలు మాత్రం ఛాన్స్ ఉంటే చూడమని అడుగుతున్నారట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu