Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దుల్కర్ బెస్ట్ 'సీతారామం' కాదట

దుల్కర్ బెస్ట్ 'సీతారామం' కాదట

Gulte.com 2 weeks ago

లయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు కొట్టాడు.

కానీ అతను సొంత భాషను మించి తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేశాడు. తిరుగులేని గుర్తింపు సంపాదించాడు. ఐతే దుల్కర్ ఎన్ని సినిమాలు చేసినా.. 'సీతారామం'ను మించే చిత్రం తన నుంచి రావడం కష్టమే అనుకున్నారంతా.

కానీ 'లక్కీ భాస్కర్'తో దానికి దీటుగా నిలిచే సినిమాను అందించాడు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమా రీచ్ విషయమై తాజాగా వెంకీతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా దుల్కరే ఆశ్చర్యపోయాడు. తన కెరీర్లో 'సీతారామం' చిత్రమే టాప్‌లో నిలుస్తుందని.. అందులో మేజర్ రామ్‌గానే ప్రేక్షకులకు గుర్తుండిపోతానని.. దాన్ని మించిన సినిమా చేయడం కష్టమని అనుకున్నానని.. కానీ 'లక్కీ భాస్కర్' దాన్ని మించిపోయిందని దుల్కర్ చెప్పడం విశేషం.

తన కొత్త చిత్రం షూటింగ్‌ కోసం తాను నెల రోజులు బుడాపెస్ట్‌లో ఉన్నానని.. అక్కడున్న భారతీయులతో పాటు బంగ్లాదేశీయులు, టిబెటన్లు, ఇంకా అనేక దేశాల వాళ్లు తనను 'లక్కీ భాస్కర్' సినిమా నటుడిగానే గుర్తుపట్టారని దుల్కర్ తెలిపాడు. తన దగ్గరికి వచ్చేవాళ్లు కాసేపు పరిశీలనగా చూస్తారని.. తర్వాత ఫోన్ తీసుకుని 'లక్కీ భాస్కర్' వీడియో చూపిస్తూ.. మీరు భాస్కర్ కదా అని అంటారని.. ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కొన్నానని దుల్కర్ తెలిపాడు.

తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎంత దూరం వెళ్తాడో చూపించిన సినిమా 'లక్కీ భాస్కర్' అని.. అందుకే జనాలు ఆ సినిమాతో, ఆ పాత్రతో విపరీతంగా కనెక్ట్ అయ్యారని దుల్కర్ తెలిపాడు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ చేద్దామంటే ఎప్పుడంటే అప్పుడు తాను రెడీగా ఉంటానని దుల్కర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వెంకీ అట్లూరి స్పందిస్తూ.. మీ కమిట్మెంట్లు అన్నీ అయిపోగానే వెంటనే 'లక్కీ భాస్కర్-2' చేద్దామంటూ.,. మరింత భయం, బాధ్యతతో స్క్రిప్టు రెడీ చేస్తానని చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu