Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ పిలిస్తే వెళ్తా - బుచ్చిబాబు

ఎన్టీఆర్ పిలిస్తే వెళ్తా - బుచ్చిబాబు

Gulte.com 4 days ago

ప్పెన సినిమాతో ఐదేళ్ల ముందు సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు బుచ్చిబాబు సానా. తొలి సినిమాను కొత్త వాళ్లతో చేసిన అతను.. రెండో చిత్రానికి ఎవరైనా మిడ్ రేంజ్ హీరోతో చేస్తాడనుకుంటే..

ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం కథ రాసి తనతో ట్రావెల్ చేశాడు. కానీ ఎందుకో ఎన్టీఆర్ సినిమా వర్కవుట్ కాలేదు. తర్వాత తెరపైకి రామ్ చరణ్ వచ్చాడు.

అతడితో పెద్ది లాంటి భారీ చిత్రం తీసి, పాన్ ఇండియా స్థాయిలో ఆ చిత్రానికి బంపర్ క్రేజ్ తీసుకొచ్చాడు. ఐతే ఎన్టీఆర్‌తో అనుకున్న కథనే చరణ్‌తో చేశాడనే అనుమానాలు చాలామందిలో ఉండగా.. తాజాగా ఒక బుచ్చిబాబు సానా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ కోసం తాను రాసింది పూర్తిగా వేరే కథ అని బుచ్చిబాబు స్పష్టం చేశాడు.

ఆ కథ లైన్ చెప్పాక, దాన్ని డెవలప్ చేయమని తారక్ తనకు చెప్పాడని.. ఆ పనిలో ఉండగానే తనకు రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో పెద్ది కథ మీద పని చేయడం మొదలుపెట్టానని బుచ్చిబాబు తెలిపాడు. ఈ ప్రాజెక్టులో బిజీ కావడంతో తారక్ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చిందని.. భవిష్యత్తులో ఆయన పిలిస్తే మళ్లీ కథ చెప్పి కచ్చితంగా సినిమా చేస్తానని బుచ్చిబాబు తెలిపాడు. ప్రస్తుతానికి తన తర్వాతి సినిమా ఏదన్నది ఇంకా ఫిక్స్ కాలేదని, తన దృష్టంతా పెద్ది విడుదల మీదే ఉందని బుచ్చిస్పష్టం చేశాడు.

నిజానికి రామ్ చరణ్ కంటే ముందే తారక్‌తో బుచ్చిబాబుకు పరిచయం ఉంది, వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నాన్నకు ప్రేమతో సినిమాకు పని చేస్తూ తారక్‌కు దగ్గరయ్యాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో బుచ్చిబాబును తారక్ తీసుకెళ్లి ఒక స్విమ్మింగ్ పూల్‌లో పడేసే వీడియో కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ వీడియో చూస్తేనే ఇద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థమవుతుంది. మరి వీరి మధ్య సినిమా ఎందుకు వర్కవుట్ కాలేదన్నది వారికే తెలియాలి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేసే టైంలోనూ తనతోనూ బుచ్చిబాబుకు సాన్నిహిత్యం ఏర్పడింది. పెద్ది పెద్ద హిట్ అయి.. తారక్‌తోనూ అతను సినిమా చేస్తాడేమో చూడాలి రి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu