Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫౌజీని తట్టుకునే సత్తా 'మైసా'కు ఉందా

ఫౌజీని తట్టుకునే సత్తా 'మైసా'కు ఉందా

Gulte.com 2 weeks ago

డిసెంబర్ నెల సంక్రాంతి లాగా మారిపోయేలా ఉంది. జనవరిలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఒక్కొక్కరు ఈ ఏడాది చివరిని ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. మూడో తేదీ ప్రభాస్ ఫౌజీ పెద్ద ఎత్తున విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

అయితే సరిగ్గా ఆరు రోజుల ముందు రష్మిక మందన్న మైసాని నవంబర్ 27 రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అంత తక్కువ గ్యాప్ అంటే లాంగ్ రన్ మీద ప్రభావం చూపించే అవకాశముంది.

మైసాలో రష్మిక మందన్న ఆయుధాలు పట్టే గిరిజన యువతిగా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోందని సమాచారం. దర్శకుడు రవీంద్ర పుల్లే దీన్ని తీర్చిదిద్దుతున్న విధానం గురించి ఇప్పటికే ఫిలిం నగర్ వర్గాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాయి. ఈ షూటింగ్ లోనే రష్మిక గాయపడి కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వయొలెన్స్ పుష్కలంగా ఉండే మైసాలో ఒక సామజిక సమస్యని ప్యాన్ ఇండియా స్థాయిలో చూపించబోతున్నారని, చాలా షాకింగ్ కంటెంట్ ఉంటుందని టాక్.

అంతా బాగానే ఉంది కానీ మరి ఫౌజీతో అంత తక్కువ గ్యాప్ లో క్లాష్ అవ్వడం ఎందుకనే అనుమానం రావడం సహజం. అయిదు భాషల మూవీ కాబట్టి ఎక్కువ ఆప్షన్లు లేకుండా పోయాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ వస్తే చివరి వారంలో బాలకృష్ణ, నాగార్జున, షారుఖ్ ఖాన్ రెడీ అవుతున్నారు. పోనీ ఇంకో నెల ఆగుదామా అంటే జనవరిలో మహా యుద్ధాలే జరుగుతున్నాయి. సో మళ్ళీ ఫిబ్రవరి దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే నిర్ణయం మార్చుకునే ఛాన్స్ లేదు.

మైసాకు కేవలం ఫౌజీతోనే పోటీ ఉండట్లేదు. శ్రద్ధ కపూర్ టైటిల్ రోల్ పోషించిన ఈధని కూడా డిసెంబర్ 4 రిలీజ్ చేస్తున్నారు. ఫౌజీతో ఒక రోజు గ్యాప్ ఉండాలనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకున్నారు. మైసాకు ఇటు తెలుగులో ప్రభాస్ నుంచి, అటు హిందీలో శ్రద్ధ నుంచి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అక్టోబర్ 16 రణబాలిలో చారిత్రాత్మక పాత్ర చేస్తున్న రష్మిక మందన్న నెల తిరగడం ఆలస్యం మరో హిస్టారికల్ క్యారెక్టర్ దక్కించుకుని ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu