Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే.

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే.

Gulte.com 1 day ago

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ సంబరాలు మిన్నంటుతాయి.

నవరాత్రి ఉత్సవాలతో ప్రతి వీధీ మోతెక్కిపోతుంది. ఇక నిమజ్జనం రోజైతే సందడి వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వరల్డ్ ఫేమస్ ఖైరతాబాద్ గణేష్‌ను నిమజ్జనం చేస్తుంటే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ ఊగిపోతాయి.

గణపయ్య ఊరేగింపు సందర్భంగా యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ జోష్ చూస్తే.. ఎవ్వరికైనా డ్యాన్స్ వేయాలి అనిపిస్తుంది. ఆటోమేటిగ్గా పాదం కదుపుతారు. అందుకు తాము కూడా మినహాయింపు కాదు అని రుజువు చేశారు పోలీస్ వాళ్లు.

శుక్రవారం ఖైరతాబాద్ గణేశ్‌ను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న సమయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. డీజే సౌండ్ మిన్నంటిన ఆ సందర్భంలో పోలీస్ వాళ్లు కూడా లోకం మరిచిపోయి నృత్యం చేశారు. పెద్ద ఎత్తున ఖాకీలు ఒకచోట గుమిగూడి స్టెప్పులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలామంది దీన్ని పాజిటివ్‌గానే చూస్తున్నారు. ఖైరతాబాద్ గణపయ్యా మజాకా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉందంటున్నారు. కానీ అదే సమయంలో కొన్ని నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. తొక్కిసలాట, గొడవలు జరిగే సమయంలో జనాలను అదుపు చేస్తూ, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సింది పోయి.. ఇలా పోలీసులు గుంపులు కట్టి డ్యాన్సులు చేయడం కరెక్టా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu