Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

Gulte.com 1 week ago

ల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్ కానగరాజ్ హీరోగా పరిచయమవుతున్న డిసి వైపు లేకపోలేదు.

ఇవి కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలు వస్తున్నాయి కానీ అవేవి ప్రేక్షకుల ఫోకస్ లో పెద్దగా లేవు. వాటిలో జిడిఎన్ ఒకటి. అంటే గోపాలస్వామి దొరస్వామి నాయుడు. మాధవన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ బయోపిక్ తెలుగు వెర్షన్ ని ఒరిజినల్ తో పాటు సమాంతరంగా ఆగస్ట్ 7 రిలీజ్ చేస్తున్నారు.

విచిత్రంగా మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎలాంటి ప్రచారాలు చేయకపోవడంతో అసలిది వస్తున్న సంగతే రిజిస్టర్ కానంత వీక్ గా ప్రమోషన్లలో వెనుకబడింది. భారతదేశంలో తొలి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టిన మహానుభావుడిగా జిడిఎన్ జీవితం ఒక స్ఫూర్తివంతమైన పుస్తకం లాంటిది. లెక్కలేనన్ని అవార్డులు గెలుచుకున్న ఈ గొప్ప ప్రతిభాశాలి లైఫులో ఎన్నో మలుపులు, డ్రామా ఉన్నాయి. వాటిని చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు కృష్ణ కుమార్ రామకుమార్.

జిడిఎన్ లో చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉంది. మాధవవ్ తో పాటు ప్రియమణి, సత్యరాజ్, జయరాం, దుశారా విజయన్, వినయ్ రాయ్, అదితి బాలన్ తదితరులు ఇందులో భాగం పంచుకున్నారు. గతంలో రాకెట్రి తీసిన నిర్మాతలే ఈ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించడం విశేషం. బడ్జెట్ భారీగానే పెట్టారు. స్వాతంత్రం నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేసి ఆర్ట్ వర్క్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంతా చేసి ఓపెనింగ్స్ రావాలంటే ప్రచార ఘట్టాన్ని బాగా డిజైన్ చేసుకోవాలి.

మాధవన్ తన వంతుగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రభంజనం ఇంకా కొనసాగుతుండగానే జిడిఎన్ థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. పైగా పెద్ద కాంపిటీషన్ స్వాగతం చెబుతోంది. మౌత్ టాక్ తోనే ఇలాంటి సినిమాలు నిలబడతాయి. మరి మాధవన్ ఈ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటే కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. లేదంటే ఎదురీదాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu