Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి పెద్ది

గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి పెద్ది

Gulte.com 3 days ago

ఇంకో పన్నెండు రోజుల్లో పెద్ది విడుదల కానుంది. ప్రీమియర్ షోలు ఉంటాయో లేదో, అసలు అప్లై చేశారో లేదోననే క్లారిటీ ఇంకా లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంలో అలెర్ట్ గానే ఉంటారు కానీ తెలంగాణలో ఏర్పడ్డ సింగల్ స్క్రీన్ల పర్సెంటెజ్ రగడ శనివారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి టెన్షన్ అక్కర్లేదు. తేలికగానే అయిపోతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ పెద్ది అత్యవసరంగా గ్రౌండ్ రియాలిటీ చూడాలి.

చికిరి చికిరి టైంలో వచ్చిన హైప్ తో పోల్చుకుంటే ట్రైలర్ రిలీజయ్యాక ఏర్పడిన బజ్ ఆ స్థాయిలో లేదనే అభిప్రాయం ఫ్యాన్స్ లోనే వినిపిస్తోంది. పదే పదే ఒక తరహా పోస్టర్లు వదలడం, ప్రతి ప్రమోషనల్ వీడియోలో చికిరి చికిరిని తప్ప వేరేది వాడుకోకపోవడం క్రమంగా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాని గమనిస్తే పెద్దిని భుజాన వేసుకోవాల్సిన వీరాభిమానులు సైతం డేట్ దగ్గరికొచ్చినప్పుడు చూద్దాంలే అనే భావనలో ఉన్నారు.

రేపు ఐటెం సాంగ్ భోపాల్ ఈవెంట్ లో లాంచ్ చేయబోతున్నారు. ఇది మొదటి రెండు పాటలను మించేలా ఉంటే తప్ప పనవ్వదు. చరణ్, బుచ్చిబాబు కారులో మాట్లాడుకుంటూ వెళ్లిన వీడియోలో సైతం ఒకటి రెండు మినహా పెద్ద మెరుపులేం లేవు. ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిన పని ఒకటుంది. మరింత బెటర్ విజువల్స్ తో ఇంకో రిలీజ్ ట్రైలర్ సిద్ధం చేయాలి. హుక్ స్టెప్ పాట మన శంకరవరప్రసాద్ గారికి ఊపు తెచ్చినట్టు పెద్దికీ అలాంటి వండర్ జరగాలి.

పవర్ ప్లే పేరుతో పెద్ది బృందం వరసగా ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ బాగున్నాయి కానీ వాటి క్షేత్ర స్థాయిలో పబ్లిక్ లోకి తీసుకెళ్లడం చాలా అవసరం. 2026 ఏ సినిమాకు దొరకనంత పెద్ద అడ్వాంటేజ్ పెద్దికి దక్కింది. దాన్ని వాడుకోవాలి. కాంపిటీషన్ లేదు. మూడు నెలలుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది. థియేటర్లకు వచ్చేందుకు మాస్ జనాలు తహతహలాడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది పరుగులు పెట్టడమే. అభిమానులకు ఉన్నఫళంగా జోష్ ఇచ్చే కంటెంట్ ఒకటి ఏదైనా వదిలితే బెటర్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu