Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోగా లోకేష్ కనకరాజ్. బీభత్సమే

హీరోగా లోకేష్ కనకరాజ్. బీభత్సమే

Gulte.com 1 week ago

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మల్టీవెర్స్ అనేక కాన్సెప్టుతో హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించాడతను.

ఐతే తన చుట్టూ హైప్ పెరిగాక లియో, కూలీ చిత్రాలతో నిరాశపరిచిన లోకేష్.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా తీయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈలోపు అతను.. హీరోగా ఒక సినిమా చేశాడు. అదే.. డీసీ. కీర్తి సురేష్‌తో సాని కాయితం, ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్‌.. లోకేష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌తో ప్రేక్షకులను పలకరించింది. హీరోగా లోకేష్ చిత్రం ఆషామాషీదేమీ కాదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఒక రౌడీ.. ఒక వేశ్య.. వీళ్లిద్దరి మధ్య పరిచయం.. ప్రేమ.. సంఘర్షణ.. గ్యాంగ్ వార్స్ ఈ నేపథ్యంలో నడిచే కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో వేశ్యగా మారిన హీరోయిన్ దగ్గరికి వచ్చిన హీరో.. ఆమెకు ఆకర్షితుడై తనతో ప్రయాణం చేయడం.. తర్వాత ఇద్దరూ చిక్కుల్లో పడడం.. ఇటు పోలీసులు, అటు రౌడీలు వీళ్లిద్దరి వెంట పడడం.. ఈ క్రమంలో ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగించే పరిస్థితి రావడం.. ఈ నేపథ్యంలో చాలా వయొలెంట్‌గా నడిచే సినిమాలా ఉందిది.

ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లే వయొలెన్స్‌ను హద్దులు దాటించేశారు. ట్రైలర్లో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఒక దర్శకుడు హీరోగా మారిన సినిమాలో మరీ ఇంత బీభత్సమా అనిపించేలా సాగింది ట్రైలర్. కథ పాతగా అనిపించినా.. నరేషన్ కొత్తగా ఉంటుందని.. యాక్షన్ ప్రియులకు సినిమా కనువిందే అని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu