Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరుముడిలో బంగారు పల్లకి పాట ఖాయమేనా?

ఇరుముడిలో బంగారు పల్లకి పాట ఖాయమేనా?

Gulte.com 1 week ago

కెరీర్లో ఎక్కువ శాతం మాస్ మసాలా సినిమాలే చేస్తూ వచ్చిన రవితేజ.. ఈ మధ్య రూటు మార్చేశాడు. ఈ సంక్రాంతికి మాస్ అంశాలేమీ లేకుండా భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి పక్కా ఫ్యామిలీ మూవీతో పలకరించిన రవితేజ… ఇప్పుడు నిన్ను కోరి, మజిలీ, ఖుషి లాంటి క్లాస్ లవ్ స్టోరీలు తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ చూసి అందరూ షాకైపోయారు.

రవితేజ నుంచి ఇలాంటి సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. ఇందులో ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకునే మధ్య తరగతి వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్రను చేసింది లేదు. అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో పాత్ర, మాలధారణ నేపథ్యంలో సినిమా అనగానే ఇందులో పాటల విషయంలో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

మాల ధరించిన స్వాములు పాడుకునే ఫేమస్ అయ్యప్ప పాటలు ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ పాటల్లో బాగా ఫేమస్ అయిన విల్లాది వీరుడు.. వీరమణి కంఠుడు సాంగ్ మీద ఆల్రెడీ ఒక బజ్ నడుస్తోంది. ఇంతకుముందు తన సినిమా రిలీజ్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ మూవీలో ఈ పాట ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చాడు.

ఇప్పుడు ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ వేశాడు. విల్లాది వీరుడు.. వీరమణి కంఠుడు అనే లైన్స్ రాసి ఫైర్ ఎమోజీతో ట్వీట్ వేయడంతో ఎక్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరి ఒరిజినల్ సాంగ్‌ను యథాతథంగా వాడేస్తారా.. లేక సినిమా కోసం ట్యూన్ ఏమైనా మారుస్తారా అన్నది ఆసక్తికరం.

ఎక్కువ మార్పు లేకుండా చిన్న చిన్న చేంజెస్‌తో ఒరిజినల్ సాంగ్‌ను సినిమాలో పెడితేనే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జి.వి.ప్రకాష్ ఏం చేస్తాడో చూడాలి. మొత్తంగా ఈ సినిమా ఆల్బమ్ మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ నటిస్తున్న ఇరుముడి ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu