Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాక్వెలిన్ బ్లాక్ మ్యాజిక్.. ఆ అందమేంటీ మేడమ్

జాక్వెలిన్ బ్లాక్ మ్యాజిక్.. ఆ అందమేంటీ మేడమ్

Gulte.com 5 days ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో చోపార్డ్ మిరాకిల్ గాలాకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసుకొచ్చిన ఈ బ్లాక్ డ్రెస్ అందరి దృష్టిని లాగుతోంది. రెడ్ కార్పెట్ కాదు, హోటల్ లో ఆమె నడుస్తున్న ఫొటోలు, అద్దం సెల్ఫీ, ఈవెంట్ బ్యాక్‌డ్రాప్ దగ్గర పోజులు నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

మినీ డ్రెస్‌లో కూడా ఇంత హంగామా చేయొచ్చని ఈ లుక్‌తో మళ్లీ చూపించింది.

ఆమె డ్రెస్ పూర్తిగా టెక్స్చర్డ్ నలుపు వస్త్రం. చిన్న చిన్న మెరుపులతో కాంతి వస్తోంది. దానికి తోడు డైమండ్ గొలుసు, పెద్ద గుండ్రని చెవి రింగులు, చేతికి వెడల్పాటి కడియం. జుట్టుని ఒక పక్కగా వదిలేసి, తళుకు మేకప్‌తో పూర్తి చేసింది. నగలు ఎక్కువ లేవు కానీ ఉన్నవే లుక్‌ని నింపాయి. నలుపు చెప్పులతో ఆ నడక ఫొటోకి కొత్త అందం తెచ్చింది.

జాక్వెలిన్ సినిమాలు చేస్తుందా లేదా అనే మాట ఎప్పుడూ ఉంటుంది. 2023లో సర్కస్, సెల్ఫీ సినిమాలో పాట, 2024లో ఫతే, అమెరికన్ సినిమా కిల్ ఎమ్ ఆల్ 2, 2025లో రైడ్ 2, హౌస్‌ఫుల్ 5 చేసింది. 2026లో వెల్‌కమ్ టు ది జంగిల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే తెర మీద ఖాళీ లేదు. అయినా సినిమాల లెక్క పక్కన పెడితే, ఆమెలో ఉన్న హుందాతనం మాత్రం ఎక్కడికీ పోలేదు. ఈ కేన్స్ ఫొటోలే దానికి నిదర్శనం.

ఈ లుక్‌లో హైలెట్ అయ్యే విషయం ఏంటంటే పెద్దగా కష్టపడినట్టు కనిపించకపోవడం. పోజులు పెట్టినట్టు లేదు. అద్దం సెల్ఫీ అయినా, మెట్ల దగ్గర నిల్చున్నా చాలా సహజంగా ఉంది. గ్లామర్ అంటే అంతకుమించి అనేలా అలంకరణ కాదు, వేసుకున్న దాన్ని ఎంత గ్లామరస్ గా హైలెట్ చేస్తున్నారనేది ముఖ్యం. జాక్వెలిన్‌కి ఆ విషయం బాగా తెలుసు.

15 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా ఫ్యాషన్‌తో కొత్తగా ట్రై చేయగలగడం, ప్రతి ఈవెంట్‌కి కొత్తగా కనిపించడం సులువు కాదు. ఇక గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన క్రేజ్ ని అలా నిలబెట్టుకుంటూ వస్తోంది. కేన్స్ లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఇండియా నుంచి వెళ్లి ఇలా ఆకట్టుకోవడం చిన్న విషయం కాదు. ఈ లుక్ చూస్తే ఆమెకు గ్లామర్ కొత్త కాదు, అది తనలో భాగమైపోయింది అనిపిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu