Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతీయ రాజకీయాలపై రేవంత్ కన్ను

జాతీయ రాజకీయాలపై రేవంత్ కన్ను

Gulte.com 1 week ago

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ ను గద్దె దించి… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆయన అధికార పార్టీగా మలచారు.

సీఎంగా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో రాజకీయంగా రేవంత్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. 2034 వరకూ తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని ఆయన శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం ఓ న్యూస్ యాప్ ఏర్పాటు చేసిన న్యూస్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఉచ్ఛ స్థితిలో ఉన్న రేవంత్… ఇదే స్థితిలో మరో ఏడెనిమిది ఏళ్ల పాటు కొనసాగుతానన్న ధీమాను వ్యక్తం చేశారు. 2034 వరకు తాను రాష్ట్ర రాజకీయీల్లోనే కొనసాగుతానని చెప్పిన రేవంత్… అప్పటిదాకా రాష్ట్రానికి సీఎంగా తానే కొనసాగుతానని చెప్పారు. 2034 తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ఆయన చెప్పారు.

వాస్తవానికి ఈ మాటను గతంలోనూ పలుమార్లు రేవంత్ చెప్పారు. అయితే ఈ దఫా ఆయన నోట స్పష్టమైన ధీమా వ్యక్తం అయ్యిందని చెప్పాలి. 2034 వరకు తెలంగాణ సీఎంగా తానే ఉంటానని చెప్పిన రేవంత్… కావాలంటే రాసి పెట్టుకోండని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఓ జడ్పీటీసీగా ఉన్న తనను సీఎంవి అవుతావా? అంటూ కొందరు ప్రశ్నించారని ఆయన తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నాడు వారి ప్రశ్నలకు తన మౌనమే సమాధానం చెప్పిందన్న రేవంత్… జడ్పీటీసీ నుంచి సీఎం అయి చూపించానని వ్యాఖ్యానించారు. 2034 తర్వాత తన తర్వాతి తరానికి సీఎం పదవిని అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu