Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ ఇల్లు ఏమైనా ఫంక్షన్ హాలా?

జగన్ ఇల్లు ఏమైనా ఫంక్షన్ హాలా?

Gulte.com 10 hrs ago

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె వివాహం నవంబరు 25న జరగనుంది. ఈ పెళ్లిని బెంగుళూరులోని జగన్ నివాసంలో జరపాలని షర్మిల అనుకున్నారని, కానీ, అందుకు జగన్ నిరాకరించారని టాక్ వస్తోంది.

ఈ విషయం గురించి కొన్ని తెలుగు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. జగన్, షర్మిలల ఇళ్లు పక్కపక్కనే ఒకే కాంపౌండ్ లో ఉండడంతో అక్కడ పెళ్లి వేడుక నిర్వహించే హక్కు షర్మిలకు ఉందని, దానిని జగన్ కాలరాస్తున్నారన్నది ఆ కథనాల సారాంశం. ఈ క్రమంలోనే ఆ విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీనిచ్చారు.

బెంగుళూరులోని ఎలహంకలో జగన్, షర్మిలలకు ఒకే జాయింట్ ప్రాపర్టీ ఉందని, ఆ ప్రాపర్టీలో ఒకే ఎంట్రీ గేట్ లో జగన్, షర్మిలల రెండు ఇళ్లు పక్క పక్కన ఉన్నాయని చెప్పారు. అయితే, వారిద్దరికీ భేదాభిప్రాయాలున్నాయని, ఇద్దరిలో జగన్ కు ప్రాణహాని ఉంది కాబట్టి ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉందని చెప్పారు.

అటువంటి హై ప్రొఫైల్ వ్యక్తి కాంపౌండ్ లో పెళ్లిళ్లు చేయడం ఎలా కుదురుతుంది అని ఆయన ప్రశ్నించారు. పైగా, అది కళ్యాణమండపం కాదని చెప్పారు. ఆ రెండు ఇళ్లు ఒకే కాంపౌండ్ లో ఉండడంతో ఒకే గేట్ ఉందని, జగన్, షర్మిల, విజయమ్మ అందరూ ఒకే గేటులో నుంచి లోపలికి వెళ్లాలని చెప్పారు.

పెళ్లి అంటే క్లీనింగ్, క్యాటరింగ్, డెకరేషన్ తదితర విభాగాలకు చెందిన వ్యక్తులు, పెళ్లికి అతిథులు వస్తారని, భద్రతా రీత్యా ఆ కాంపౌండ్ లో పెళ్లి ఎలా సాధ్యం అవుతుందని నాని ప్రశ్నించారు. ఇదే విషయం షర్మిలకు జగన్ చిలక్కి చెప్పినట్లు చెప్పాడని గుర్తు చేశారు. అయినా, బెంగుళూరులో బోలెడు హాల్స్ ఉన్నాయని అన్నారు.

ఇక, చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ కు శుక్రవారం వెళ్లి సోమవారం వస్తున్నారని, వాళ్ల ఇంటి ఫొటోలు ఎప్పుడైనా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ, ఈనాడులో రామోజీరావు వాళ్ల అబ్బాయి ఎప్పుడైనా ప్రచురించారా అని ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu