Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జోగి రమేష్ కోడలిపై హత్యాయత్నం?

జోగి రమేష్ కోడలిపై హత్యాయత్నం?

Gulte.com 2 hrs ago

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణలపై హత్యాయత్నం జరిగిందా? వారిని చంపేసేందుకు పక్కా ప్రణాళిక రచించారా? అంటే.. బాధితులు చెబుతున్న కథనం మేరకు..

ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జోగి కుటుంబంపై మేఘన కేసులు పెట్టారు. తనను వేధించారని.. నపుంశకుడైన జోగి రాజీవ్‌కు ఇచ్చి వివాహం చేయడమే కాకుండా.. కోట్ల రూపాయలను అదనపు కట్నంగా తీసుకురావాలని హుకుం జారీ చేశారని మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదేసమయంలో ఆమె తనపై అత్త, భర్త కూడా హత్యాయత్నం చేశారని గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో జోగి కుటుంబం కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లింది. ఆ తర్వాత.. పార్టీ సీనియర్ నాయకుడు సహా.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆధ్వర్యంలో సానుకూలంగా చర్చలు జరిపి.. రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ, మేఘన మాత్రం కోర్టులో వేసిన కేసులను వెనక్కి తీసుకునేది లేదని చెబుతున్నారు. తమ నుంచి తీసుకున్న కోట్ల రూపాయల సొమ్ములు సహా 2 కిలోలకు పైగా ఆభరణాలను వెనక్కి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చలు, రాజీ వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమపై హత్యా యత్నం జరిగిందని మేఘన, ఆమె తండ్రి కృష్ణలు ఆరోపించారు. విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న తమపై వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు గుద్దించే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. సరిగ్గా హైవేపైనే ఇది జరిగిందని.. వారు చెబుతున్నారు. అయితే.. తమ కారు వెనుకభాగం మాత్రమే దెబ్బతిందని.. ఏమాత్రం తమ డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయినా.. తమ ప్రాణాలు పోయేవని అంటున్నారు.

కేసు నమోదు!

ఈ క్రమంలో మేఘన, కృష్ణలు కోదాడ పోలీసులను ఆశ్రయించి.. ఘటనకు సంబంధించిన విషయాలపై వారికి ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు హైవేపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన తర్వాత కేసు పెడతామని చెప్పినట్టు మేఘన పేర్కొన్నారు. వాస్తవానికి మేఘన వ్యవహారం జోగికి కంట్లో నలుసుగా మారింది. ఆమె కారణంగా తన రాజకీయాలు దెబ్బతింటున్నాయని.. ఇది టీడీపీ నేతలు చేస్తున్న వ్యవహారమని రమేష్ గతంలోనే ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు రావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu