Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

Gulte.com 3 weeks ago

లమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్ 7 విడుదల కాబోతున్న ఈ కామెడీ హారర్ కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది.

జూన్ నుంచి బాక్సాఫీస్ మంచి జోష్ లో ఉన్న నేపథ్యంలో ఇది కూడా హిట్ల సరసన చేరుతుందనే నమ్మకం బయ్యర్లలో వ్యక్తమవుతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. స్టోరీ ఏంటో దాచకుండా క్లూస్ ఇచ్చేశారు.

రాయలసీమ ప్రాంతం పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు. కొరియా నుంచి వచ్చిన ఒక అమ్మాయి (రితిక నాయక్) ని తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమిస్తాడు. ఇలా జాలీగా జరుగుతున్న ఇతని లైఫ్ లోకి ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ (వరుణ్ తేజ్) లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అనంతపురం నుంచి కొరియా దేశం దాకా కనకరాజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తర్వాత ఏమైందనేది అసలు కథ.

పవన్ కళ్యాణ్ ఓజి రేంజ్ బిల్డప్ వరుణ్ తేజ్ కి పెట్టినట్టు అనిపిస్తున్నా ప్రధానంగా నవ్వించే ఉద్దేశంతోనే మేర్లపాక గాంధీ ఈ స్క్రిప్ట్ రాసుకున్నట్టు కనిపిస్తోంది. కమెడియన్ సత్యకు మరోసారి అధిక ప్రాధాన్యం దక్కింది. మాములుగా ఇలాంటి సీరియస్ డ్రామాలలో ఎంటర్ టైన్మెంట్ కష్టం. ఎప్పుడూ బంగాళాలో దెయ్యాలను చూసి బోర్ కొట్టిందనే ఉద్దేశంతో ఈసారి ఏకంగా కొరియా నుంచి దిగుమతి చేయడం అసలు విశేషం. యునీక్ అనిపిస్తున్న అంశం ఇదే.

హాస్యం కనక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కనకరాజు ఖాతాలో హిట్టు పడ్డట్టే. వరుణ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత మంచి ఎనర్జీతో కనిపిస్తున్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేపధ్యానికి తగినట్టు ఉంది. పెద్దగా టెన్షన్ పడే కాంపిటీషన్ లేకుండా బరిలో దిగుతున్న కొరియన్ కనకరాజు కనక సక్సెస్ కొడితే జూలై నెల బోణీ గ్రాండ్ గా మొదలవుతుంది. వరుణ్ తేజ్ ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్నాడు. ఇంత కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని ఫ్యాన్స్ కోరిక.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu