Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవితకు. షర్మిలకు.. పోలికా?

కవితకు. షర్మిలకు.. పోలికా?

Gulte.com 4 hrs ago

వితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కవిత తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెల్లు కాగా షర్మిల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు. ఈ ఇద్దరు వచ్చిన రాజకీయ నేపథ్యం గురించి నెటిజన్లు చర్చించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాలలో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్ మధ్య ఒక విచిత్రమైన పోలిక వుంది. ఈ రెండూ పార్టీలకు రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా ఒకే విధమైన సమస్యలు ఏర్పడటం కాకతాలీయమని చెప్పొచ్చు. తెలంగాణాలో 10 ఏళ్ళ పాటు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారంలో వున్న వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.

అన్న జగన్ తో ఆస్తి తగాదాల కారణంగా విభేదించిన షర్మిల వైసీపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కవిత కూడా ఆస్తి తగాదాలతో పాటుగా రాజకీయ వారసత్వం విషయంలో తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లకు కటీఫ్ చెప్పి తెరాస పేరుతో సొంత పార్టీ పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రజలు కవిత, షర్మిలలను పోల్చి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది కవితకు నచ్చడం లేదు.

ఈ విషయాన్ని టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో కవిత తీవ్రంగా ఖండించారు. షర్మిల నేపథ్యం వేరు నా నేపథ్యం వేరు, నేను తెలంగాణా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాను అని చెప్పుకున్నారు. ఎలాగైతే కెసిఆర్ పార్టీ పెట్టి సక్సస్ అయ్యారో అదే విధంగా నేను సక్సస్ అవుతాను అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో కొత్త అధ్యాయం సృష్టించబోతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలు పెట్టి నడపటం చేతకాక వేరే పార్టీల్లో విలీనం చేసిన వారి గురించి తనకు అవసరం లేదన్నారు. తాను రాజీ రాజకీయాలు చేయడం లేదన్నారు. భవిష్యత్తులో తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయనంటూ తేల్చి చెప్పారు.

కవిత ఇంటర్యూ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటీ చావో రేవో అన్నట్లు జరగబోతున్న తరుణంలో కవిత మాటలు కెసిఆర్ కోటలో ప్రకంపనలు సృష్టిస్తుంది. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి వుంది. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా ఒక కారణమేనన్న విశ్లేషణలు వచ్చాయి. రేపు 2029లో కూడా చెల్లెమ్మ షర్మిల అన్నయ్య జగన్ ఆశలకు గండి కొట్టే అవకాశం వుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu