Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొరటాలతో బాలయ్య 2.O?

కొరటాలతో బాలయ్య 2.O?

Gulte.com 6 days ago

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఇప్పటివరకు ఫ్యాక్షన్, పంచ్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కానీ కొరటాల శివ ఇప్పుడు ఆ ఇమేజ్‌ని బ్రేక్ చేయబోతున్నాడు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని టాక్.

దానికి బాలీవుడ్ స్టార్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ వర్క్ చేస్తున్నాడు. ఇది మామూలు మేకోవర్ కాదు.

ఆలీమ్ హకీమ్ దాదాపు ఇండియన్ స్టార్స్ అందరితో వర్క్ చేశారు. అతను జుట్టు కత్తిరించడు, క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు. 64 ఏళ్ల బాలయ్యకి ఇప్పుడు కావాల్సింది యాటిట్యూడ్ చూపించే కట్. గ్రే షేడ్స్‌ని కూడా గ్రేస్‌గా మార్చే డిజైన్. 'భరత్ అనే నేను'లో మహేష్‌ని సీఎంగా క్లాస్‌గా చూపించిన కొరటాల, ఇప్పుడు బాలయ్యని 'మాస్ మహారాజ్' నుంచి 'స్టైలిష్ ఐకాన్'గా మార్చాలని చూస్తున్నాడు.

ఇది బాలయ్య కెరీర్‌ లో 2.O లెక్క తరహాలో ఉందని చెప్పవచ్చు. అఖండ తర్వాత మాస్‌లో పీక్స్ చూశాడు. కానీ మళ్ళీ దాని సీక్వెల్ తో ఫ్లాప్ చూశారు. ఇక 'జైలర్'లో రజినీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో ఎలా కనెక్ట్ అయ్యాడో, అలాంటి ట్రాన్సిషన్ ఇప్పుడు బాలయ్యకి అవసరం. మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని టీమ్ చెబుతోంది.

రిస్క్ లేకపోలేదు. బాలయ్య ఫ్యాన్స్ ఊర మాస్ కోరుకుంటారు. గ్లాసెస్, జెల్ పెట్టిన హెయిర్ చూసి "మా బాలయ్యేనా?" అని డౌట్ పడతారు. కానీ 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో రాజు గెటప్‌ని యాక్సెప్ట్ చేశారు. కథలో దమ్ముంటే, స్టైలిష్‌గా ఉన్నా ఓన్ చేసుకుంటారు. లుక్ కోసం లుక్ కాకూడదు. క్యారెక్టర్ డిమాండ్ చేయాలి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రానున్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu