Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైనప్ మార్చబోతున్న రవితేజ ?

లైనప్ మార్చబోతున్న రవితేజ ?

Gulte.com 1 week ago

రుముడి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం అభిమానులకే కాదు రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తీసుకొచ్చింది. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం గురించి ట్రేడ్ వర్గాలు రోజూ కథలుగా చెప్పుకుంటున్నాయి.

రెండో వారంలో టాక్సిక్ వల్ల స్క్రీన్లు తగ్గినప్పటికీ దాని టాక్ ప్రభావంతో ఇరుముడికి మళ్ళీ షోలు పెరుగుతున్నాయి. అయితే ఇంత సక్సెస్ వచ్చాక ఏ హీరో అయినా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రవితేజ ముందు రెండు కమిట్ మెంట్లు ఉన్నాయి. మొదటిది శ్రీవిష్ణు కాంబోలో దిల్ రాజు నిర్మాతగా హసిత్ గోలి దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న ఎంటర్ టైనర్. దీనికి దాగుడుమూతల దండాకోర్ అనే టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉంది. రెండోది వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నిర్మాత లక్ష్మణ్ తీయబోయే భారీ చిత్రం. దీంట్లో కొంచెం హారర్ టచ్ ఉంటుందని వినికిడి. సరిపోదా శనివారం తర్వాత రెండేళ్ల గ్యాప్ లో వివేక్ ఆత్రేయ చాలా ఇష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్.

వరస ప్రకారం చూసుకుంటే ముందు హసిత్ గోలిది మొదలవ్వాలి. అయితే ఇరుముడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు వివేక్ ఆత్రేయ సినిమానే పట్టాలు ఎక్కొచ్చని వినికిడి. రెండూ సమాంతరంగా చేసినా ఇబ్బంది ఉండదు కానీ లుక్స్ పరంగా మార్పులు ఉంటాయి కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. హసిత్ రాసుకున్న ఎంటర్ టైనర్ లో కొన్ని కీలక మార్పులు అవసరం కావడంతో దాని మీద వర్క్ చేయడానికి ఎక్కువ సమయం కావాలి కాబట్టి కొంత లేట్ చేయొచ్చని అంటున్నారు.

ఇదంతా ఇప్పటికిప్పుడు నిర్ధారణగా చెప్పలేం కానీ లోలోపల చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నిజమైతే మటుకు సెప్టెంబర్ మూడో వారం లేదా అక్టోబర్ లో వివేక్ మూవీ సెట్స్ పైకి వెళ్లొచ్చు. హసిత్ గోలిది మొదలైతే సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పని చేస్తారట. ఏదైతేనేం మొత్తానికి ఇరుముడి రవితేజ ఆలోచనా ధోరణిలో చాలా మార్పు తెచ్చినట్టు ఉంది. ఒకరకంగా ఇది మంచిదే. తనను ఆడియన్స్ ఎలా చూడాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu