Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

Gulte.com 3 weeks ago

త రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ శ్రీనివాస మంగాపురంకు సూపర్ స్టార్ నుంచి పూర్తి స్థాయి మద్దతు దక్కలేదని స్వంత ఫ్యాన్స్ తో పాటు పలువురు ఇతర హీరోల అభిమానులు కంప్లయింట్ చేస్తున్న తరహాలో ట్వీట్లు పెట్టడం వైరలయ్యింది.

తిరుమలలో ఒంటరిగా దర్శనం చేసుకుని జయకృష్ణ బయటికి వస్తున్న వీడియోని కోట్ చేసి మరీ రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

అసలు మహేష్ ఎందుకు ఎక్కువ చొరవ తీసుకోలేదనే దాని మీద ఏవేవో విశ్లేషణలు జరుగుతున్నాయి. ఓపెన్ గా చెప్పాలంటే తన కుటుంబం నుంచి ఎవరైనా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నారంటే దానికి తన వంతు మద్దతు మహేష్ ఎప్పుడూ ఇస్తూ వచ్చాడు. సుధీర్ బాబు దాదాపు అన్ని సినిమాలకు ఆన్ లైన్ ట్రైలర్ లాంచులు చేశాడు, శుభాకాంక్షలు చెప్పాడు. మేనల్లుడు అశోక గల్లా చేసినవి అంతంత మాత్రం సినిమాలే అయినా తన మాట సహాయ పడుతుందేమోనని సపోర్ట్ ప్రకటించాడు.

అయితే జయకృష్ణ కేసు వేరు. స్వయానా అన్న రమేష్ బాబు కొడుకు. తండ్రి తాత కృష్ణ ఇద్దరూ లేరు. అలాంటప్పుడు బాబు అంతా తానై వ్యవహరించాలనేది ఫ్యాన్స్ కోరిక. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం వారణాసి టీమ్ తో చేసుకున్న ఒప్పందం ఏమైనా మహేష్ ని ఫ్రీగా ఇతర ఈవెంట్లకు రాకుండా అడ్డు పడుతోందానే అనుమానం జనాల్లో లేకపోలేదు. నిర్మాణ భాగస్వామి అయినప్పటికీ సత్యదేవ్ రావు బహదూర్ విషయంలో మహేష్ చూపించిన చొరవ తక్కువే. అయితే అదే మహేష్ సినిమాలు చూడడానికి థియేటర్ కు వెళ్ళడం ఏంటని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు.

సరే కారణాలు ఏమైనా జయకృష్ణ వేసింది తొలి అడుగే. అది హిట్టవుతుందా లేదానేది పక్కన పెడితే కొన్నేళ్ల వరకు అవకాశాలకు ఢోకా లేకుండా సినిమాలు వస్తాయి. వాటితో మరింత మెరుగవ్వడమే కాకుండా తానేంటో ఋజువు చేసుకోవాలి. ఎలాగూ మహేష్ సపోర్ట్ ఖచ్చితంగా దక్కుతుంది. తెర వెనుక ఏంటనేది పక్కన పెడితే మహేష్ ప్రోత్సాహం లేకుండా జయకృష్ణ అడుగులు వేయడం లేదు. అశ్విని దత్ లాంటి అగ్రనిర్మాత సమర్పకుడిగా ఉండటానికి కారణమే తను. సో కాలం చెప్పే సమాధానం కోసం వేచి చూడటం తప్ప ఫ్యాన్స్ అయినా చేయగలిగింది ఏమీ లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu