సోలో హీరోగా ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ అటు విలన్ గా చేస్తూనే కథానాయకుడిగా కూడా వరసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. డేవిడ్ రెడ్డి ఆల్రెడీ నిర్మాణంలో ఉంది.
ప్యాన్ ఇండియా బడ్జెట్ తో తీస్తున్నారు. ఇవాళ కొత్త మూవీ వడ్డీకాసులవాడ అనౌన్స్ చేశారు. అనిల్ సుంకరతో పాటు మనోజ్ నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీ కాన్సెప్ట్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు మొత్తం ఏఐ టెక్నాలజీ వాడి కథేంటో క్లూ ఇచ్చారు.
నెల తిరిగే సరికి అప్పుల్లో కూరుకుపోయే ఒక తిరుపతి కుర్రాడికి ఎలాగైనా సరే వాటి నుంచి బయటపడి శ్రీమంతుడిగా మారి దర్జాగా బ్రతకాలనేది కోరిక. దాని కోసం ఏడుకొండల వాడిని నిత్యం వేడుకుంటూ ఉంటాడు. ఒకవేళ తన కలను నిజం చేస్తే ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి కులం మతం చూడకుండా ఇరవై అయిదు శాతం డిస్కౌంట్ ఇస్తానని నొక్కి చెబుతాడు. అది కూడా తండ్రి మోహన్ బాబుని ఇమిటేట్ చేస్తున్న వాయిస్ తో కావడం గమనించాల్సిన విషయం.

