Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరీ ఎక్కువ చెప్పినా కష్టమేమో పెద్దీ..

మరీ ఎక్కువ చెప్పినా కష్టమేమో పెద్దీ..

Gulte.com 2 weeks ago

కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి ఆ సినిమా మీద ఉండేలా చేయడం అవసరమే కానీ..

ఆ చిత్రం గురించి మరీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే ప్రేక్షకులు మరీ ఎక్కువ అంచనాలు పెంచేసుకుంటారు. కంటెంట్ పరంగా ఆ అంచనాలను అందుకోవడం కష్టమైతే పెదవి విరుపులు తప్పవు.

టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ పెద్ది ఇలాంటి ముప్పును ఎదుర్కొంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.పెద్ది సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ ముంగిట హైప్ ఇంకా పెంచేలా టీం గట్టిగా ప్రమోషన్లు చేస్తోంది. ఓవైపు ప్రెస్ మీట్లు, ఇంకోవైపు ఇంటర్వ్యూలతో టీం హోరెత్తించేస్తోంది. కానీ అందులో ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు కోటల్ని దాటిపోతున్నాయి.

రామ్ చరణ్ ఇప్పటికే మగధీర, రంగస్థలం లాంటి అద్భుత చిత్రాల్లో నటించాడు. కానీ దర్శకుడు బుచ్చిబాబేమో పెద్దినే తన కెరీర్లో అత్యంత గొప్ప కథ అని, దీని తర్వాత ఇంత గొప్పకథలో అతను నటించడం కష్టమని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన శివరాజ్ కుమార్, జగపతిబాబు సైతం పెద్ది కథ గురించి, మొత్తంగా సినిమా గురించి వేరే లేవెల్లో మాట్లాడారు. రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు పక్కా అని శివన్న అంటే.. జగపతిబాబేమో తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండే అరడజను బెస్ట్ మూవీస్‌లో పెద్ది ఒకటని వ్యాఖ్యానించాడు. ఈ కథను దర్శకుడితో పాటు హీరోను ఆయన ఆకాశానికెత్తేశారు.

ఇందులో విలన్ పాత్ర చేసిన దివ్యేందు.. పెద్ది సినిమాను ఒకసారి చూసి ఆపేయరని, వరుసపెట్టి ప్రతి రోజూ చూస్తూనే ఉంటారని తాజాగా కామెంట్ చేశాడు. మామూలుగా తక్కువగా మాట్లాడే బొమన్ ఇరానీ సైతం పెద్ది సినిమాను ఆకాశానికెత్తేశాడు. ఇక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా తదితరులు సైతం ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఇదొక మాస్టర్ పీస్ అన్నట్లే మాట్లాడుతున్నారు. కానీ ట్రైలర్ చూస్తే ఆ రేంజిలో లేదు. మరి సినిమా వీళ్ల మాటలకు తగ్గ స్థాయిలో అద్భుతంగా, అసాధారణంగా ఉంటుందన్నది చూడాలి. అలా లేని పక్షంలో సోషల్ మీడియాలో కామెంట్లు ఎలా ఉంటాయో, టీం సభ్యులు చెప్పిన మాటల మీద యాంటీ ఫ్యాన్స్ ఏ రేంజిలో ట్రోలింగ్ చేస్తారో చెప్పేదేముంది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu