Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా 158. తలుపు తెరుచుకుంది

మెగా 158. తలుపు తెరుచుకుంది

Gulte.com 3 days ago

మార్చి నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ ఎదురు చూసిన మెగాస్టార్ 158 ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ సంరంభారానికి ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.

బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకి తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ప్రియమణి భార్యగా అనస్వర రాజన్ కూతురిగా చిరు ఫ్యామిలీలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.

వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల చివరి నిమిషంలో రామ్ చరణ్ డ్రాప్ అయినట్టు సమాచారం. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొంచెం గ్యాప్ తీసుకుని బాలయ్యతో డాకు మహారాజ్ తీశారు. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు రెండోసారి చిరుతో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపధ్యాన్ని తీసుకుని చిరంజీవిని కొత్తగా ప్రెజెంట్ చేస్తారనే టాక్ ఉంది. వీరయ్యని మించిన ఊర మాస్ ఇందులో చూడొచ్చట.

విడుదల తేదీకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముందు విశ్వంభర సంగతి తేలాలి. వేసవి ఎలాగూ మిస్ అయిపోయింది కాబట్టి ఆగస్ట్ వైపు చూస్తున్నారు. అదీ మిస్ అయితే దసరాకు వెళ్లాల్సిందే. ఇప్పుడు స్టార్ట్ చేసిన మెగా 158 ఒకవేళ 2027 సంక్రాంతి రిలీజ్ అనుకుంటే ఇప్పటి మే మినహాయించి కేవలం 7 నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఇంత పెద్ద స్కేల్ మూవీకి అది తక్కువ టైం కాబట్టి తిరిగి సమ్మరే బెస్ట్ ఆప్షన్ కావొచ్చు.

మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా రెస్ట్ తీసుకున్న మెగాస్టార్ ఈసారి నాన్ స్టాప్ గా షూటింగ్ లో బిజీ కాబోతున్నారు. ఇది పూర్తయ్యేలోపే అటుపక్క దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మెగా 159 స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. ఇవి కాకుండా చిరు ఒప్పుకున్న కమిట్మెంట్స్ లేవు. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. టెక్నికల్ టీమ్ ని ఇప్పటికే ప్రకటించిన బాబీ త్వరలోనే మిగిలిన క్యాస్టింగ్ ని ఒక్కొక్కరిగా అనౌన్స్ చేయబోతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu