Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరంతా బొద్దింకలు.. పరాన్న జీవులు:  సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు

మీరంతా బొద్దింకలు.. పరాన్న జీవులు: సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు

Gulte.com 1 week ago

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌.. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్సర్లు, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని, కోర్టులను ప్రశ్నించేవారిపై నిప్పులు చెరిగారు.

మీరంతా బొద్దింకలు.. పరాన్న జీవులుఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనీ పాటా లేనివాళ్లు.. ఇన్ ఫ్య్లయెన్సర్లుగా అవతరిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. సమచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలపై బొద్దింకల్లా ఎగబడి దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కానీ.. ఇవి ఉన్నవి ప్రజల కోసం కాబట్టి.. సంయమనం పాటిస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఏం జరిగింది?

కొందరు న్యాయవాదులకు.. వారి సీనియారిటీని అనుసరించి.. హైకోర్టులు.. సీనియర్ అడ్వొకేట్ హోదా ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఇది కోర్టుల విచక్షణకే వదిలివేసింది. ఈ క్రమంలో సంజయ్ దుబే అనే న్యాయవాది.. తనకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిని విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆమూలాగ్రం పరిశీలించింది.

ఈ సమయంలో తనకు సదరు హోదా దక్కకపోవడంపై.. సంజయ్ దూబే చేసిన సోషల్ మీడియా వీడియోలను కూడా సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వీడియోల్లో న్యాయవ్యవస్థను కించపరిచేలా సంజయ్ దూబే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైనే సీజేఐ సీరియస్ అయ్యారు.

సోషల్ మీడియా పేరుతో న్యాయవ్యవస్థకే కాకుండా.. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను కూడా బొద్దింకల మాదిరిగా పీడిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. సోషల్ మీడియా లేకపోతే.. సమాచార హక్కు చట్టం కింద కొందరు న్యాయవాదులు వ్యవస్థలను శాసించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

అదేసమయంలో రేపు ఢిల్లీ కోర్టు మీకు..సీనియర్ అడ్వొకేట్‌గా హోదా ఇచ్చినా.. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సదరు హోదాను వెనక్కి తీసుకుంటామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో మరో బాంబు కూడా పేల్చారు. కొందరు న్యాయవాదులకు పట్టాలు ఎలా వచ్చాయో కూడా అర్థం కావడం లేదని.. ఏదో జరిగిందన్న అనుమానం ఉందన్నారు. ఎవరైనా దీనిపై పిటిషన్ వేస్తే.. న్యాయవాదుల పట్టాలపై నిశిత విచారణ కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ దెబ్బతో సంజయ్ దూబే తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu