Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నానికి పోటీగా దుల్కర్ సల్మాన్

నానికి పోటీగా దుల్కర్ సల్మాన్

Gulte.com 4 days ago

గస్ట్ 21 విడుదల కాబోతున్న నాని ప్యారడైజ్ కి పోటీ వెళ్లేందుకు పేరున్న సినిమాలు సాహసం చేయకపోవచ్చనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో క్రమంగా లెక్కలు మారుతున్నాయి.

అది వచ్చిన వారం రోజులకే శర్వానంద్ భోగి ఆల్రెడీ కర్చీఫ్ వేయగా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేసుకుని జైలర్ 2, విశ్వంభర, స్వయంభు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఒకటో రెండో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు.

దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్ ఆగస్ట్ 20 రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే కేవలం ఒక్క రోజు గ్యాప్ అన్న మాట. అయితే తెలుగు రాష్ట్రాల వరకు నానికి ఇబ్బంది లేదు కానీ కేరళ, తమిళనాడులో ఖచ్చితంగా కాంపిటీషన్ అవుతుంది. ఎందుకంటే ఐ యాం గేమ్ పేరుకి ఇంగ్లీష్ టైటిల్ అయినా ట్రేడ్ వర్గాల్లో దీని మీద చాలా క్రేజ్ ఉంది. దర్శకుడు నిహస్ హిదాయత్ మొన్న ఏడాది ఆర్డిఎక్స్ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఐ యాం గేమ్ ని ప్యాన్ ఇండియా స్థాయిలో హిందీతో కలిపి రిలీజ్ చేస్తున్నారు. అయితే నాని ఉన్నాడని తెలిసి కూడా దుల్కర్ ఈ ఆప్షన్ ఎంచుకోవడం చూస్తుంటే బిజినెస్ కొంచెం తగ్గినా పర్లేదు మంచి డేట్ ని వదులుకోకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ప్రసక్తే లేదనే సంకల్పంతో పరుగులు పెడుతున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భారీ షెడ్యూల్స్ ని అనుకున్న టైంకే పూర్తి చేస్తారట.

ఆల్రెడీ రెండు డేట్లు మార్చుకున్న ప్యారడైజ్ ఇక మాట తప్పడానికి లేదు. కయదు లోహర్ హీరోయిన్ గా మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో హీరో పాత్ర గురించి ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే షాకింగ్ ట్విస్టులు వినిపిస్తున్నాయి. అదే కనక నిజమైతే మటుకు ఈ జనరేషన్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ నాని చేసినట్టు అవుతుంది. అదేంటనేది తర్వాత బయట పడుతుంది కానీ ప్యారడైజ్ నుంచి రెండో పాట అతి త్వరలో రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu