అనుకుంటాం కానీ తమ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హీరోల చేతుల్లో ఉండవు. ఎవరిదాకో ఎందుకు మెగాస్టార్ అంతటి వారే విశ్వంభర విషయంలో ఎటు తేల్చుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం.
వాయిదాల నుంచి కాకాతో క్లాష్ అవుతుందనే పుకార్ల దాకా ఏదీ ఆయన కంట్రోల్ ఉన్నట్టు కనిపించకపోవడం మెగా ఫ్యాన్స్ కి ఇబ్బందవుతోంది. షూటింగ్ వరకు చిరంజీవి బాధ్యత అయిపోయింది. విఎఫ్ఎక్స్, రిలీజ్ వ్యవహారం, బిజినెస్ ఇవన్నీ దర్శక నిర్మాతలకు సంబంధించినవి.
నిఖిల్ సిద్దార్థ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితిలో ఒకరకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. అదిగో ఇదిగో అనడం తప్పించి స్వయంభు రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేకపోతున్నాడు. ఆ మధ్య ఏదో ఒక అప్డేట్ ఇద్దామని కొత్త స్టిల్ షేర్ చేసుకుంటే అది ఏఐలో చేసిందని నెటిజెన్లు గుర్తు పట్టేశారు. దీంతో గంటల వ్యవధిలోనే దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. 2026 చివరికి వచ్చేశాం. నవంబర్ అయిపోతోంది. ఇంకో నలభై అయిదు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అయినా స్వయంభు సౌండ్ లేదు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎపిక్ డ్రామాలో నిఖిల్ యుద్ధవీరుడిగా బాహుబలి తరహా పాత్ర చేశాడు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు నేర్చుకున్నాడు. డూప్ లేకుండా రిస్కీ ఫైట్లు చేశాడు. కెరీర్ లో ఎక్కువ కాల్షీట్లు ఇచ్చింది కూడా దీనికే. ఇంతా చేసి టైంకి విడుదల కాకపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. నిఖిల్ అందుకే తన కొత్త సినిమా అప్డేట్స్ కూడా ఇవ్వలేకపొతున్నాడు. కొత్తగా దర్శకులు ఎవరైనా కలుస్తున్నారో లేదో కూడా ఎలాంటి సమాచారం లేదు.
చూస్తుంటే 2026 రిలీజ్ సాధ్యమయ్యేలా లేదు. డిసెంబర్ మొదటి వారంలో వృషకర్మ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఉండగా చివరిలో కింగ్ 100, దాదా, కింగ్ తో పాటు హాలీవుడ్ మూవీస్ క్యూ కట్టి ఉన్నాయి. వస్తే మధ్యలో రావాలి. లేదంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి చివరికి వెళ్ళాలి. పండగ కాంపిటీషన్ లో దిగడం రిస్క్ అవుతుంది. ఇదంతా కాదు కానీ స్వయంభు సంగతి వీలైనంత త్వరగా తేలితేనే జీరో అయిపోయిన బజ్ ని తిరిగి కొత్త ప్రమోషన్లతో మళ్ళీ నిలబెట్టవచ్చు.

