Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిన్న నీట్. నేడు సీబీఎస్సీ ఫలితాలు

నిన్న నీట్. నేడు సీబీఎస్సీ ఫలితాలు

Gulte.com 0 months ago

దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం పెను సంచలనం రేపింది.

ఫలితంగా నీట్ పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తిరిగి మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తాజాగా ఈ నెల ప్రథమార్థంలో విడుదలైన సీబీఎస్సీ ఇంటర్ ఫలితాలు కూడా విమర్శల సుడిలో చిక్కుకున్నాయి. పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సీబీఎస్సీ ఇంటర్ ఫేపర్ల రీ వాల్యూయేషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సీబీఎస్సీ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఒప్పుకున్న ప్రదాన్… పరీక్షా పేపర్ల రీ వాల్యూయేషన్ కు ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రకటించారు.

అయితే ఈ వ్యవహారంపై విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జవాబు పత్రాల మార్పిడి, ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వంటి వాటిలో తప్పులు జరిగాయని ఆయన ప్రకటించారు. వీటిని సరిదిద్దేందుకే రీ వాల్యూయేషన్ కు ప్రకటన జారీ చేసినట్లు చెప్పారు.

ఇప్పటిదాకా జాతీయ స్థాయి విద్యా విధానంలో ఈ ఏడాది ఎదురైన చేదు అనుభవాలు చోటుచేసుకోలేదనే చెప్పాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఓ మోస్తరు అవకతవకలు జరిగినా… జాతీయ స్థాయి పరీక్షలో ఇలాంటివి ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి.

నీట్ కు సంబందించి గడచిన కొంతకాలంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు వేధిస్తున్నా… దానిని అధిగమించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. అయితే ఈ ఏడాది అటు నీట్ పేపర్ లీక్, ఇటు సీబీఎస్సీ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu