Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నువ్వొస్తానంటే నేనొద్దంటనా.. ఐకానిక్ షాట్ వెనుక?

నువ్వొస్తానంటే నేనొద్దంటనా.. ఐకానిక్ షాట్ వెనుక?

Gulte.com 5 days ago

తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్‌లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈ సినిమా తీసి గొప్ప పేరు సంపాదించారు.

ఈ చిత్రానికి దర్శకుడు ప్రభుదేవా అయినప్పటికీ.. రైటింగ్, మేకింగ్‌లో రాజు ఎంతో ఇన్వాల్వ్ అయ్యారన్న సంగతి తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు.

ఈ చిత్రంలో ఎన్నో అద్భుత సన్నివేశాలు ఉంటాయి. గల్ గల్ అంటూ సాగే పాట మధ్యలో ఒక మేక.. తన మేకపిల్లకు జన్మనిచ్చే సన్నివేశంలో హీరో హీరోయిన్ల స్పందనను కథలోని సందర్భానికి తగ్గట్లు ఎంతో హృద్యంగా తీశారు. ఐతే ఈ ఐడియా పూర్తిగా ఎం.ఎస్.రాజుదేనట. స్క్రిప్టులో లేని విషయాన్ని అప్పటికప్పుడు మెరుపు లాంటి ఆలోచనతో ఎలా తీశామో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎస్.రాజు వెల్లడించారు.

నిజానికి అప్పుడు పాట చిత్రీకరణ ఏమీ జరగట్లేదట. ప్రకాష్ రాజ్ గొడ్డు కారం అన్నం తినే సన్నివేశాన్ని తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. దర్శకుడు ప్రభుదేవా ఆ సన్నివేశాన్ని ప్రకాష్ రాజ్‌కు వివరిస్తున్న సమయంలో మేకల దొడ్డిలో ఒక మేక ఇబ్బంది పడుతుండడాన్ని ఎం.ఎస్.రాజు గమనించారట. అది ప్రసవించబోతోందని తనకు అర్థమై, వెంటనే దాన్ని క్యాప్చర్ చేసి సినిమా కోసం వాడుకోవాలని ఆలోచించారట రాజు.

వెంటనే సినిమాటోగ్రాఫర్ వేణుతో పాటు దర్శకుడు ప్రభుదేవాను గట్టిగా కేకేసి పిలిచారట రాజు. ప్రకాష్ రాజ్ కూడా ఏంటి హడావుడి అంటూ అక్కడికి వచ్చారని.. తాను వెంటనే సినిమాటోగ్రాఫర్‌కు ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేయమని చెప్పానని రాజు తెలిపారు. హీరో సిద్దార్థ్‌ను కూడా పిలిచి ప్రసవించిన మేకపిల్లను చేతిలోకి తీసుకుని అబ్బుర పడే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వమని చెప్పానన్నారు.

అప్పటికి త్రిష సెట్లో లేదని.. తర్వాతి రోజు ఆమె వచ్చాక సిద్ధుతో కలిసి మేక ప్రసవిస్తున్న దృశ్యం చూస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వమని చెప్పినట్లు రాజు తెలిపారు. ఐతే ఆ సన్నివేశ నేపథ్యం అర్ధం కాక ముందు తీసిన రషెస్ చూపించమని అడిగిందని, అది తెప్పించి చూపించాక, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌తో ఆ షాట్ పూర్తి చేసిందని రాజు వెల్లడించారు. అలా గల్ గల్ పాటలో వచ్చే ఆ హృద్యమైన షాట్ క్రెడిట్ తనదే అని చెప్పుకొచ్చారు రాజు. ఈ దిగ్గజ నిర్మాత దర్శకుడిగా రూపొందించిన అగధ త్వరలో విడుదల కాబోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu