Dailyhunt
ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

Gulte.com 1 week ago

పీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం.. తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది.

ఇక, లోక్‌సభలో ఆమోదం కూడా పొందిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దీనికి ఆమోద ముంద్ర వేయడంతో అధికారికంగా.. అమరావతికి చట్టబద్ధత చేకూరుతుంది. అయితే.. దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏంటి? చట్టబద్ధత కారణంగా అమరావతికి ప్రత్యేకంగా లభించే లబ్ధి ఎంత? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

ఇదీ లబ్ధి!

+ ఇప్పటి వరకు అమరావతిపై సందేహాలు నెలకొన్నాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం స్థానంలో జగన్ అధికారంలోకి వస్తే.. మరో సారి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదికి తెస్తే.. అప్పుడు అమరావతి పరిస్థితి ఏంటనేది చర్చ. వాస్తవానికి.. జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటూనే..తాజాగా కూడా `మావిగన్`(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని) ప్రతిపాదన చేశారు. ఇలాంటివాటికి ఈ చట్టబద్ధత అడ్డుకునే అవకాశం ఉంది.

+ ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో కేవలం కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమి(బీజేపీ+టీడీపీ+ ఇతర పార్టీలు) మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చిన దరిమిలా.. చట్టబద్ధతకు మరింత బలం చేకూరింది. ఒకవేళ రేపు జగన్ మరోసారి మార్చాలని ప్రయత్నించినా.. ఇప్పుడు సమర్థించిన ఆయా పార్టీలు.. జగన్ వైఖరిని సమర్థించే పరిస్థితి ఉండదు.

+ రాజధానిలో రెండో దశ విస్తరణ పనులు కూడా చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. తొలిదశలో భూములు ఇచ్చిన వారికి న్యాయం జరగడం లేదని.. అమరావతిని మార్చే ప్రయత్నాలు కూడా గతంలో జగన్ చేశారని.. ఇక్కడి రైతులు గగ్గోలు పెట్టారు. రెండో దశలో భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న దరిమిలా.. రైతుల్లో ఉన్న ఈ సంశయాలకు తెరపడే అవకాశం ఉంది. రెండో దశ అమరావతికి కూడా భూములు ఇచ్చేందుకు రైతులు సంతోషంగా ముందుకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

+ ఇక, మరో కీలక మార్పు విషయానికి వస్తే..అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం కొన్నాళ్లుగా మందగమనంలో సాగుతోంది. రాజధానిపై `నికరం` లేదంటూ.. కొందరు వ్యాపారులు వెనక్కి తగ్గారు. మళ్లీ జగన్ వస్తే.. ఏం జరుగుతుందో అనుకునే వారు కూడా వెనుకాడారు. ఈ పరిణామాలకు తాజా చట్టబద్ధత బలమైన సమాధానం చెప్పనుంది. ఇక, నుంచి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగనుంది. వ్యాపారాలు.. నిర్మాణాలు కూడా పుంజుకోనున్నాయి.

+ భూముల ధరలు కూడా అమరావతిలో గత కొన్నాళ్లుగా తగ్గుతున్నాయి. వాస్తవానికి అమరావతిని రాజధానిగా ప్రకటించిన 2015-19 మధ్య రాజధానిలో ఎకరం భూమి 5 కోట్ల నుంచి 10 మధ్య పలికింది. కానీ.. జగన్ రాకతో.. ఈ ధరలు ఢమాల్ మన్నాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినా.. పెద్దగా కదలిక రాలేదు. కానీ.. ఇప్పుడు చట్టబద్ధత కారణంగా భూముల ధరలకు రెక్కలు రానున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu