Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే గంపలో రెండు పెద్ద సినిమాలు

ఒకే గంపలో రెండు పెద్ద సినిమాలు

Gulte.com 1 week ago

విజయ్ 'జన నాయగన్', యష్ 'టాక్సిక్'. రెండు వేరే భాషలు, రెండు వేరే కథలు, కానీ KVN సంస్థ మాత్రం రెండింటినీ కలిపి ఒకే ఓటీటీ సంస్థకు అమ్మే పనిలో ఉంది.

సాధారణంగా ఒక సినిమా పూర్తయ్యాక దాని డిజిటల్ హక్కులు అమ్ముతారు. కానీ KVN మాత్రం రెండు పెద్ద సినిమాల్ని కలిపి మూకుమ్మడి బేరం పెడుతోంది. ఇలా చేస్తే ఓటీటీ సంస్థకు ఒకేసారి రెండు బలమైన సినిమాలు దొరుకుతాయి.

విడివిడిగా అమ్మితే 10 రూపాయలు, రెండింటినీ కలిపి అమ్మితే 15 రూపాయలు అనేది సినీ వర్గాల లెక్క. ఎందుకంటే విజయ్‌కి తమిళం, తెలుగు, కేరళలో లక్షల మంది అభిమానులు ఉన్నారు. యష్ 'కేజీఎఫ్' తర్వాత ఉత్తరాదిన కూడా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు బలాల్ని కలిపి ఒకే ఓటీటీకి ఇస్తే, ఆ సంస్థకు దక్షిణాదితో పాటు ఉత్తరాది నుంచి కూడా చందాదారులు పెరుగుతారు. అందుకే అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలు మళ్లీ చర్చలకు వస్తున్నాయి.

జన నాయగన్ కి ఇప్పుడు రాజకీయ గాలి కూడా తోడైంది. విజయ్ సీఎం కావడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపు అయ్యింది. రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి ఓటీటీలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇక 'టాక్సిక్' పూర్తిగా వేరే దారి.

గీతూ మోహన్‌దాస్ తీస్తున్న ఈ సినిమా ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ కథ. కుటుంబంతో చూసే వాళ్లకి జన నాయగన్, యువతకు టాక్సిక్. ఇలా ఒకే వేదికపై రెండు రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. అందుకే KVN ఒకే బేరం, రెండు లాభాలు అనే పద్ధతిలో వెళ్తోంది.

KVN వేస్తున్న ఈ కొత్త ఎత్తుగడ ఫలిస్తే, దక్షిణాదిలో ఓటీటీ ఒప్పందాల తీరే మారిపోతుంది. ఇకపై పెద్ద హీరోల సినిమాల్ని ఒక్కొక్కటిగా కాకుండా రెండు మూడు కలిపి 'ప్యాకేజీ'లా అమ్మే పద్ధతి మొదలవ్వచ్చు. జన నాయగన్ లోని రాజకీయ బలం, టాక్సిక్ లోని మాస్ స్టైల్ రెండూ కలిస్తే ఓటీటీకి పెద్ద పండగే. ఈ ఒప్పందం కుదిరితే సినిమా డిజిటల్ చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ అవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu