Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు'

'పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు'

Gulte.com 5 days ago

వైసీపీ అధినేత జగన్‌పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేస్తానని జగన్ చెబుతున్న నేపథ్యంలో అదే విషయాన్ని టార్గెట్ చేసుకున్న షర్మిల..

పాదయాత్ర చేసినంత మాత్రాన.. వైఎస్ రాజశేఖరరెడ్డికి వారసులు కాలేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు వైఎస్ పేరు చెప్పి అధికారంలోకొచ్చి మేడలు, మిద్దెలు కట్టుకున్నారనని దుయ్యబట్టారు. ⁠ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం వైఎస్ వారసత్వం కాదని ఎద్దేవా చేశారు. ⁠ప్యాలెస్ లో బ్రతికితే కూడా వైఎస్ వారసులు కాలేరని వ్యాఖ్యానించారు.

రాజశేఖరరెడ్డి ఆశయాలు, ఐడియాలజి పాటించే వాళ్ళే ఆయనకు నిజమైన వారసులని షర్మిల చెప్పారు. ⁠కాంగ్రెస్ ను బలపరచ డం అంటే వైఎస్‌ ఆశయాలను నిలబెట్టడమేనన్నారు. రాజశేఖరరెడ్డి రాత్రికి రాత్రి సులువుగా ముఖ్యమంత్రి కాలేదని తెలిపారు. ⁠ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డారని చెప్పారు.

ఆయన నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేశారని వారి కోసమే వెళ్లి ఆయన మృతి చెందారని తెలిపారు. ⁠ఈ మధ్య నాయకులు ఒక సారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందుబాటులో లేరు. ⁠సొంత పార్టీ నాయకులకు కూడా కనపడలేదు. ⁠మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా కలవడానికి వీలు లేదు. అంటూ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

వైఎస్ లాంటి నేత మళ్లీ పుట్టడని షర్మిల తెలిపారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతిదీ అద్భుతమని చెప్పారు. ⁠ఇతర పార్టీల ఐడియాలజీకి , కాంగ్రెస్ ఐడియాలజీకి చాలా భిన్నమని, రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ఐడియాలజీ కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగం బ్రతికి ఉండాలంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావాలని షర్మిల వ్యాఖ్యానించారు. ⁠దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆయన కలను నిజం చేయడానికే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు.

మళ్లీ కాంగ్రెస్ వస్తేనే..

⁠విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రం చితికి పోయిందన్న షర్మిల.. ⁠మళ్లీ రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. వైఎస్ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. వైఎస్‌ మరణం తర్వాత స్ట్రాంగ్ లీడర్ లేక రాష్ట్ర విభజన జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ⁠తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది చనిపోవద్దనే ఏకైక కారణంతోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని తెలిపారు.

ఆంధ్రకు అన్యాయం చేయాలని విభజన చేయలేదన్నారు. విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఎన్నో హామీలు చట్టంలో పెట్టారని తెలిపారు. ⁠ప్రత్యేక హోదా కాంగ్రెస్ చట్టంలో పెట్టిందన్నారు.(వాస్తవానికి ఇది నోటి మాట మాత్రమే. చట్టం లేదు). ⁠హోదా వచ్చి ఉంటే పన్నుల రాయితీ ఉండేదని షర్మిల తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu