Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరీక్షల వలయంలో పెద్ది ప్రయాణం

పరీక్షల వలయంలో పెద్ది ప్రయాణం

Gulte.com 3 weeks ago

పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్ లో తన ప్రావీణ్యం చూపించి గెలుపు అందుకుంటుంది.

అయితే బయట కూడా పెద్దికి అంతకు మించిన సవాళ్లు ఎదురవుతున్నాయి. విడుదల తేదీలు రెండుసార్లు మార్చాల్సి వచ్చింది. చికిరి చికిరి టైంలో వచ్చిన ఆకాశమంత హైప్ ట్రైలర్ తర్వాత కాస్త తగ్గింది. ఐటెం సాంగ్ సైతం సెన్సేషన్ కాలేదు. అయినా సరే పెద్ది మీద ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇటు నైజాంలో టికెట్ రేట్ల పెంపు గురించి సానుకూల స్పందన వచ్చే అవకాశం లేకపోవడంతో పిటీషన్ వెనక్కు తీసుకున్న పెద్ది బృందానికి ప్రభుత్వం నుంచి కూడా మద్దతు దక్కేలా లేదు. ఒకవేళ ఇది నిజమైతే అంతా మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు మల్టీప్లెక్సు గరిష్ట ధర 295, సింగల్ స్క్రీన్ 175 నుంచి 200 రూపాయల మధ్యలో టికెట్లు అమ్ముతారు. సామాన్య ప్రేక్షకులు ఎక్కువ శాతం చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లు కళకళలాడతాయి.

అంటే ఎక్కువ ధరలతో వారం రోజులు హౌస్ ఫుల్స్ పడటం కన్నా రెండు మూడు వారాలు జనాలు నిండుగా రావడమే థియేటర్ వ్యవస్థకు మరింత ఊపిరి పోస్తుంది. లాభాలు కొంచెం నెమ్మదించవచ్చేమో కానీ బ్లాక్ బస్టర్ ఫలితాన్ని మార్చేలేవు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ పెట్టిన దృష్ట్యా రికవరీ కోణంలో నిర్మాతలు హైక్స్ ఆశించడం సహజం. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో అనుమతులు వస్తాయి కాబట్టి రెవిన్యూని ఆ రకంగా బ్యాలన్స్ చేసుకుంటే సరిపోతుంది.

ప్రీమియర్లు జూన్ 3 పడబోతున్నాయి. తెలంగాణలోనూ వేయాలంటే రెగ్యులర్ రేట్లతో ఆడించాల్సి ఉంటుంది. ఎందుకంటే యుఎస్, ఏపీలో షోలు పడి ఇక్కడ వేయకపోతే టాక్ పరంగా ఇబ్బంది అవుతుంది. అందుకే రాజా సాబ్ లాగా మాములు ధరలతో స్పెషల్ షోలు వేస్తే ఫ్యాన్స్ కి పండగే. పోటీ లేకపోవడం పెద్దికి కలిసి వస్తున్న సానుకూలాంశం. ఎబోవ్ యావరేజ్ నుంచి సూపర్ హిట్ టాక్ వరకు ఏది వచ్చినా రామ్ చరణ్ హయ్యెస్ట్ నెంబర్లు నమోదు చేయడం అయితే ఖాయమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu