Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది దర్శకుడికి పెద్ద హీరో దొరకట్లేదా

పెద్ది దర్శకుడికి పెద్ద హీరో దొరకట్లేదా

Gulte.com 2 days ago

జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా బోలెడంత నమ్మకం పెట్టుకున్నారు. రెండో సినిమాకే అతను ప్యాన్ ఇండియా డైరెక్టర్ కావడం ఖాయమని తెగ ఊరించారు.

నాలుగు వందల కోట్లు వసూలు చేసినట్టు నిర్మాత ప్రకటించుకున్నప్పటికీ బుచ్చిబాబుకి పూర్తి ఆనందం మిగల్లేదు. ఎందుకంటే తెలుగులో విజయం సాధించినా హిందీతో సహా ఇతర భాషలు అన్నిటిలోనూ పెద్దికి ఫ్లాప్ ముద్ర పడింది.

ఇప్పుడు బుచ్చిబాబు నెక్స్ట్ ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా తొలగిపోలేదు. పెద్ది ఫలితం ఆశించినంత రాకపోయినా అదేమీ డిజాస్టర్ కాదు. తెలుగు జనాన్ని మెప్పించింది. కాకపోతే ఎమోషన్ డోస్ ఎక్కువైపోవడం, కమర్షియల్ సారం కన్నా భావోద్వేగాలు బరువైపోవడంతో అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. పోనీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చాకైనా మిలియన్ల వ్యూస్ తో నెంబర్ వన్ అవుతుందేమోనని ఎదురు చూస్తే రొటీన్ కోర్ట్ డ్రామా ఇక్కాని కూడా దాటలేకపోయింది.

దీని సంగతలా ఉంచితే బుచ్చిబాబు ప్రస్తుతం రెండు స్క్రిప్ట్ ల మీద పని చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. అప్పుడెప్పుడో మహేష్ బాబు ఆసక్తిగా ఉన్నాడనే ప్రచారం జరిగింది కానీ వారణాసి రిలీజయ్యేవరకు తను ఎవరితో కలిసే ఆలోచనలో లేడని స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. సో ఆ న్యూస్ నిజం కాదు. ఓ ఇద్దరు టయర్ 2 హీరోలు బుచ్చిబాబుతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఎంతవరకు ఈ కాంబోలు సాధ్యమవుతాయో చెప్పలేం.

ఇప్పటికైతే బుచ్చిబాబు టయర్ వన్ హీరోలతోనే సినిమా చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. శరీర భాగాలు కోసుకోవడం లాంటి కాన్సెప్ట్ లేకుండా పక్కా మాస్ సబ్జెక్టు సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. రంగస్థలం ఫ్లేవర్ లో గురువుని అనుసరిస్తూ మెసేజులు గోల లేకుండా రాసుకున్నారని సమాచారం. అసలైతే రామ్ చరణ్ తోనే ఇంకో మూవీ చేయాలనేది బుచ్చిబాబు సంకల్పం. కాకపోతే అది ఇప్ప్పుడప్పుడే సాధ్యమయ్యేలా లేదు. చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ఆప్షన్ చూసుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu