Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి కోసం హత్య: 23 ఏళ్లుగా ప్రేమ ఖైదీలు!

పెళ్లి కోసం హత్య: 23 ఏళ్లుగా ప్రేమ ఖైదీలు!

Gulte.com 5 days ago

ఆ యువతీ యువకులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడదామని అనుకున్నారు. కానీ, విధి వక్రించింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

దీంతో సదరు పెళ్లి కాస్తా నిలిచిపోగా.. 23 ఏళ్లుగా ప్రేయసీ ప్రియులు జైల్లోనే మగ్గుతున్నారు. ప్రస్తుతం వారిలో ప్రియుడి వయసు.. 50 ఏళ్లుకాగా, ప్రియురాలి వయసు 48 ఏళ్లు. అయినా.. వీరికి ఎలాంటి మనస్సాంతి లేదు. ఎందుకంటే.. వారికి పడిన శిక్ష.. జీవిత ఖైదు!.

ఏం జరిగింది?

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన శుభ, అరుణ్‌లు ప్రేమించుకున్నారు. 2003లోనే వారు వివాహం చేసుకు నేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయంలో ఇంట్లో వారికిచెబితే కాదంటారని భావించిన శుభ.. అరుణ్‌లు రహస్యంగానే వివాహం చేసుకుందామని.. అయితే కొన్నాళ్లు ఆగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి శుభ లా చదువుతోంది. అరుణ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతలో శుభ కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం నిర్ణయించారు. గిరీష్ అనే అబ్బాయితో ఏకంగా నిశ్చితార్థం కూడా పెట్టేశారు.

ఇంకేముంది.. శుభ, అరుణ్‌లలో ఆందోళన ప్రారంభమైంది. పోనీ.. వారు పారిపోయి వివాహం చేసుకున్నా.. హ్యాపీగా ఉండేవారేమో?!. కానీ, ఇక్కడే తప్పటడుగు వేసి.. ప్రాణాలు తీశారు. నిశ్చితార్థం జరిగిన గిరీష్‌ను శుభ పక్కా ప్రణాళిక ప్రకారం.. బెంగళూరులోని రింగు రోడ్డు వద్దకు ఓ అర్ధరాత్రి రప్పించింది. కారులో వచ్చిన అతనితో కలిసి మూడు రౌండ్లు తను కూడా కారులో చక్కర్లు కొట్టింది. అనంతరం.. గగనతలంలో తిరుగుతున్న విమానాలను చూద్దామంటూ.. కారులో నుంచి గిరీష్‌ను బయటకు తీసుకువచ్చింది.

ఇక, ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న శుభ ప్రియుడు.. అరుణ్ .. గిరీష్‌పై దాడి చేసి కొట్టి చంపేశాడు. దీనికి గాను బైక్‌ల షేక్ అబ్జార్బర్‌లను వినియోగించారు. ఈ ఘటనలో గిరీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకేముంది.. ముందస్తు ప్లాన్లో భాగంగా ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించి.. తాము రెండు మూడురోజుల్లో వివాహం చేసుకోవాలని శుభ, అరుణ్‌లు నిర్ణయించుకున్నారు. కానీ, కథ అడ్డం తిరిగి.. ఇద్దరూ దొరికి పోయారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా వారు జైల్లోనే ఉన్నారు.

ఈ కేసును సమగ్రంగా విచారించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు.. శుభ, అరుణ్‌లకు జీవిత ఖైదు విధించాయి. అనంతరం.. శుభ ఈ వ్యవహారంపై క్షమాభిక్ష పిటిషన్ వేసింది. తమ ఉద్రోకంలో ఈ ఘటన జరిగిందని.. కావాలని చేయలేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ పిటిషన్‌.. గవర్నర్ వద్ద ఉంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం క్షమాభిక్షకు అనుకూలంగా ఉంటే గవర్నర్ ఆమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ, సీఎం డీకే శివకుమార్ మాత్రం దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారు జైల్లోనే మగ్గిపోతే తప్ప.. సమాజానికి సరైన సంకేతాలు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం శుభ వయసు 48 ఏళ్లు, అరుణ్ వయసు 50 ఏళ్లు. ఈ ప్రేమికులు ఎప్పటికి బయటకు వస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu