Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోయే వాళ్లు పోండి: జగన్ దారిలో మమత?

పోయే వాళ్లు పోండి: జగన్ దారిలో మమత?

Gulte.com 6 days ago

రాజకీయాల్లో చింత చచ్చినా పులుపు చావదని అన్నట్టుగా కొందరు నాయకులు వ్యవహరిస్తారు. ఇలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం జగన్ ఒకరు. ఆయన పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా మార్పు రాకపోగా..

పార్టీలో ఉన్నవారిని కించపరిచేలా వ్యవహరించారన్న వాదన ఉంది. ఉంటే ఉండండి పోతే పోండి! అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో బలమైన నాయకులు పార్టీని వదిలేశారు.

ఇప్పుడు.. జగన్ దారిలోనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కూడా నడుస్తున్నారు. పార్టీ నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీలో ఎంత మంది నాతో ఉండాలని అనుకుంటే అంత మందే ఉండండి. బీజేపీ కి భయపడే వాళ్లు.. పార్టీలో కోవర్టులుగా ఉంటూ.. ప్రభుత్వానికి సహకరించే వారు నాకు అవసరం లేదు. నేను మిమ్మల్ని బుజ్జగించను. బ్రతిమాలను. ఈ పార్టీ నా సొంతం అని నోరు జారారు.

వాస్తవానికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ 80 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది. దీంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కానీ.. ఈ హోదా లేకుండా చేయాలన్న వ్యూహంతో బీజేపీ వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొంటే.. టీఎంసీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నది బీజేపీ నాయకుల అంచనా. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు.. పార్టీకి గత వారం రోజులుగా దూరంగా ఉంటున్నారు.

మరోవైపు జిల్లాలు, మండలాల స్థాయిలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీ వర్సెస్ టీఎంసీ(మమత పార్టీ) నేతల మధ్య తీవ్ర వివాదాలు.. హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి సమయంలో పార్టీ నాయకులను బుజ్జగించి.. వారికి ధైర్యం చెప్పాల్సిన మమతా బెనర్జీ..

జగన్ తరహాలో ఉంటే ఉండండి.. లేకపోతే పోండి! అన్నట్టుగా వ్యవహరించారు. పైగా.. ఈ పార్టీ తన సొంతం అని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. 1998 సంవత్సరం వరకు కాంగ్రెస్‌లో ఉన్న మమతా బెనర్జీ.. ఆ తర్వాత.. సొంతగా పార్టీ పెట్టుకున్నారు. దాదాపు 10 సంవత్సరాలు పోరాడి 2011లో అధికారంంలోకి వచ్చారు. తాజాగా ఓడిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu