Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

Gulte.com 4 hrs ago

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా 'ఫౌజి' మరోసారి వాయిదా పడబోతోందని స్పష్టమైపోయింది. ఆ సినిమా చెప్పిన ప్రకారం డిసెంబరు 3న రిలీజయ్యేట్లయితే..

దానికి పోటీగా మరే చిత్రాన్ని రిలీజ్ చేసే సాహసం చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఆ వీకెండ్ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి వేరే సినిమాలు. ఆల్రెడీ విశ్వక్సేన్ మూవీ 'లెగసీ'కి డిసెంబరు 4న విడుదల అంటూ డేట్ ఇచ్చినపుడే ఫౌజి విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు నాగచైతన్య మూవీ 'వృషకర్మ' టీం కూడా అదే డేట్ ఎంచుకోవడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇవి కాక హిందీలో రెండు పెద్ద సినిమాలు ఆ రోజు రిలీజయ్యే అవకాశాలున్నాయి. 'ఫౌజి' టీం నుంచి స్పష్టత తెచ్చుకున్నాకే మిగతా చిత్రాల మేకర్స్ ధైర్యంగా డేట్లు ప్రకటిస్తున్నారన్నది స్పష్టం. కాబట్టి 'ఫౌజి' ఈ ఏడాది రాదన్నట్లే.

ఈ సినిమా వాయిదా పడిందంటే.. మొత్తం ప్రభాస్ నటిస్తున్న, నటించబోయే సినిమాలన్నింటికీ షెడ్యూళ్లు మారబోతున్నట్లే. ఫౌజి కోసం అదనంగా కొన్ని రోజులు ప్రభాస్ పని చేయాల్సి ఉంటుందన్నది స్పష్టం. దీంతో దీనికి సమాంతరంగా చేస్తున్న 'స్పిరిట్' షూట్ ఆలస్యం అవుతుంది. 'ఫౌజి' ఇప్పుడు మిస్సయిందంటే ఇక మార్చికే రిలీజ్ అని అంటున్నారు. అంటే 'స్పిరిట్' ఆ నెలలో రాదన్నది స్పష్టం. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ సినిమాలంటే ఒకదానికి ఇంకోదానికి మధ్య మూణ్నాలుగు నెలలైనా గ్యాప్ ఉండాల్సిందే. కాబట్టి 'స్పిరిట్' వేసవిని మిస్సవుతున్నట్లే.

ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేసి వీలైనంత త్వరగా 'కల్కి-2'ను మొదలుపెట్టాలనుకున్నాడు ప్రభాస్. కానీ ఇప్పుడు ఆ సినిమా మరింత ఆలస్యం కాబోతోంది. వచ్చే ఏడాది ద్వితీయార్దానికి కానీ ప్రభాస్ ఆ మూవీకి కాల్ షీట్లు ఇచ్చేలా లేడు. ఇంకోవైపు 'సలార్-2' కూడా మరింత ఆలస్యం అవ్వడం లాంఛనమే. ప్రభాస్‌తో సినిమాలు చేయాలని చూస్తున్న వేరే దర్శకులు, నిర్మాతలు కూడా మరింత కాలం నిరీక్షించక తప్పదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu