Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ టార్గెట్ ఆరు నెలలు

రామ్ టార్గెట్ ఆరు నెలలు

Gulte.com 1 week ago

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు. అయితే ఈసారి కేవలం హీరోగా కాకుండా దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

తన ఎనర్జీని సరైన రీతిలో వాడుకునే డైరెక్టర్ దొరక్కపోవడంతో తానే మెగా ఫోన్ చేపట్టాలని నిర్ణయించుకుని ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందబోయే ఈ మూవీకి సామ్ సిఎస్ సంగీతం సమకూర్చబోతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారట. అంటే మే, డిసెంబర్ మినహాయిస్తే కేవలం ఆరు నెలల వ్యవధిలో మొత్తం పూర్తి చేసి థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. ఇదేమి అసాధ్యం కాదు. ఎందుకంటే రామ్ ఎంచుకున్నది థ్రిల్లర్ జానర్. విఎఫెక్స్ అవసరం ఉంటుంది కానీ మరీ తీవ్రంగా కాదు. విదేశాలకు వెళ్లే పనుండదు. అన్నీ సక్రమంగా టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తే నవంబర్ కల్లా ఫైనల్ కాపీ సిద్ధం చేయొచ్చు.

వేగం విషయంలో అనిల్ రావిపూడిని స్ఫూర్తిగా తీసుకున్నాడు కాబోలు. గీత రచయితగా ఆల్రెడీ తన పెన్నుని పరిచయం చేసిన రామ్ ఇప్పుడు అసలైన సవాల్ ఎదురుకోబోతున్నాడు. ఎందుకంటే దీని జోలికి వెళ్లిన న్యూ జనరేషన్ హీరోలు చాలా తక్కువ. విశ్వక్ సేన్ ఒక్కడే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తుంటాడు. కిరణ్ అబ్బవరం త్వరలోనే రియాలిటీ పేరుతో ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పడు రామ్ ఈ లిస్టులో తోడవుతున్నాడు.

చాలా సవాళ్ళను రామ్ స్వీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరు మీడియం రేంజ్ స్టార్ డైరెక్టర్లు తనను ఇటీవల కలిసినా కథ నచ్చక నో చెప్పాడట. అలాంటప్పుడు తానే డైరెక్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తే బలంగా ప్రూవ్ చేసుకోవాలి. ఏ మాత్రం అటుఇటు అయినా నెగటివ్ కామెంట్స్ వస్తాయి. ఒకవేళ సక్సెస్ అయితే తన పేరు స్పెషల్ గా ఉండిపోతుంది. అందులోనూ డిఫరెంట్ జానర్ తో ట్రై చేస్తున్నాడు కాబట్టి రిజల్ట్ దక్కితే వేరేవాళ్లు కూడా ఫాలో అవుతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu