Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

Gulte.com 2 hrs ago

వరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్ మెంట్. సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయాలని కంకణం కట్టుకుంటే చాలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ కాకుండా అనుకున్న టార్గెట్ ప్రకారం ప్లానింగ్ మిస్ కాకుండా చూసుకుంటారు.

ఆదర్శ కుటుంబంలో బిజీగా ఉన్న వెంకటేష్ ని ఒప్పించి ఆల్రెడీ జనవరి 12 విడుదల షూటింగ్ అరవై శాతం పైగా పూర్తి చేయడం మాములు విషయం కాదు.

ఇక్కడితో అయిపోలేదు. తెలియకుండా జరిగినా, కావాలని చేసినా ఏదో ఒక రూపంలో కంటెంట్ లీక్ కావడం వల్ల కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతోంది. ఇటీవలే పాట షూట్ తాలూకు విజువల్స్ వీడియోగా బయటికి వచ్చాయి. ఆర్టిస్టులందరూ స్పష్టంగా కనిపించారు. తాజాగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఫస్ట్ హాఫ్ చూశానని, అదిరిపోయిందని ట్వీట్ వేశారు. అంటే రీ రికార్డింగ్ ఎక్కడి దాకా వచ్చిందో మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పించడం ద్వారా అనిల్ స్ట్రాటజీ ఏంటో అర్థమయ్యింది.

ఇంత ప్రణాళికతో వేరే ఏ సంక్రాంతి సినిమా లేదనేది వాస్తవం. చిరంజీవి కాకా స్పీడ్ గా ఉన్నప్పటికీ హైలైట్ కావాల్సిన విషయంలో జనవరి 12 విడుదల కన్నా కొంచెం వెనుకబడే ఉంది. సంబరాల ఏటిగట్టు సౌండ్ లేదు. మహాకాళీ ఇంకా అసలు పని మొదలుపెట్టలేదు. శర్వానంద్ జార్జ్ క్రిష్ ఇటీవలే ప్రారంభమయ్యింది కాబట్టి అప్డేట్స్ ఆశించలేం. శ్రీవిష్ణు టీమ్ తమ రిలీజ్ గురించి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇలా అందరికీ ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.

సెప్టెంబర్ మినహాయిస్తే ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఎవరికి దొరకనంత టైం అనిల్ రావిపూడికి దక్కనుంది. పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేస్తే డిసెంబర్ మొత్తం ప్రమోషన్లు చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండకుండా తన సినిమాని జనాలకు దగ్గర చేయాలంటే ఎంత చేయాలో అంత కన్నా ఎక్కువే చేస్తారు రావిపూడి. రెండు జంటల కామెడీ తెరమీద ఓ రేంజ్ లో పండిందనే టాక్ యూనిట్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu