Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రక్షించాల్సిన బాధ్యత ఇక రావణుడిదే

రక్షించాల్సిన బాధ్యత ఇక రావణుడిదే

Gulte.com 2 weeks ago

నాలుగేళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావడంతో యష్ బాగా డిఫెన్స్ లో పడిపోయాడు. డిజాస్టర్లు అందరు హీరోలకు వస్తాయి కానీ ప్రస్తుతం తను అనుభవిస్తున్న స్థితి వేరు.

హీరోగానే కాక రచయితగా, సహనిర్మాతగా ట్రిపుల్ రోల్ చేశాడు. దానికి తోడు ఇంగ్లీష్ వెర్షన్ పట్టుబట్టి మరీ తీయిస్తే అది మరీ అత్తెసరు వసూళ్లతో చేతులు ఎత్తేయడం మరింత బాధ కలిగించే విషయం. ఇవి చాలవన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ, ట్రోలింగ్ వగైరాలు తనకు తెలియకుండా పోవు.

చాలా తక్కువ గ్యాప్ లో అంటే రెండున్నర నెలల తర్వాత రామాయణ వస్తోంది. ఇందులో రావణుడిగా యష్ నటించాడు. తన మీద పెర్ఫార్మన్స్ పరంగా వచ్చిన కామెంట్స్, కథల ఎంపిక గురించి వచ్చిన ఫీడ్ బ్యాక్ కు సమాధానం ఇవ్వాలంటే అది దీంతోనే జరగాలి. కాకపోతే చిక్కు ఏంటంటే రామాయణలో హీరో యష్ కాదు. రన్బీర్ కపూర్. పైగా పార్ట్ 1లో ఎక్కువ తన గురించే ఉంటుందట. రెండో భాగంలోనే యష్ కు ఎక్కువ స్పేస్ దొరికిందని ముంబై మీడియా టాక్.

రామాయణ ఎంత పెద్ద హిట్టయినా క్రెడిట్ విషయంలో అందరూ పోటీ పడతారు. అసలే విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా. బాగుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తాయి. ఏదైనా తేడా కొడితే ఏమవుతుందో ఆదిపురుష్ ఆల్రెడీ చూపించింది. రామాయణ మొదటి క్యాటగిరీలో ఉండాలనేది ప్రతిఒక్కరి కోరిక. పాజిటివ్ అయితే అది యష్ కు ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది వేచి చూడాలి. ఎందుకంటే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి రిస్క్ ఉంటుంది.

ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఎవరితో చేయాలనే దాని మీద యష్ తన సన్నిహితులతో మాట్లాడుతున్నట్టు సమాచారం. వంద శాతం కన్నడ దర్శకుడికే ఓటు వేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడట. ప్రశాంత్ నీల్ తరహాలో మంచి సబ్జెక్టుతో ఎవరు వచ్చినా ఆలస్యం చేయకుండా సెట్స్ పైకి వెళ్లిపోయేలా రెడీగా ఉన్నాడట. సప్తసాగరాలు దాటి ఫేమ్ హేమంత్ రావు పేరు ముందు వరసలో ఉన్నట్టు బెంగళూరు టాక్. ప్రస్తుతం ఆయన శివరాజ్ కుమార్ తో ఒక ఫాంటసీ మూవీ తీస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu