Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

Gulte.com 1 week ago

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్ చేయడం. మాములుగా ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ వస్తోందంటే దానికి విపరీతమైన హైప్ ఉంటుంది.

కానీ విచిత్రంగా దీని విషయంలో అంత దూకుడు కనిపించకపోవడం ఒకరకంగా విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూసే. లేదంటే తమిళనాడు ఏమో కానీ తెలుగు రాష్ట్రాల్లోనే సీరియస్ కాంపిటీషన్ ఎదురుకోవాల్సి వచ్చేది. సో టాక్ వచ్చేదాకా భయపడేందుకు లేదు.

ఇక రెండోది సోషల్ మీడియాలో కాచుకున్న నెగటివిటీ. కారణాలు ఏమైనా విజయ్ దేవరకొండ ఒక వర్గానికి టార్గెట్ గా మారిన వైనం ఎక్స్, ఇన్స్ టాలో గమనించవచ్చు. ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక నెటిజెన్లు కొందరు అకారణంగా ద్వేషం పెంచుకున్నారా తెలియదు కానీ దీన్ని బద్దలు కొట్టాలంటే రణబాలికి యూనానిమస్ టాక్ రావాలి. విజయ్ ఈ మధ్య సెటిల్డ్ గా మాట్లాడుతున్నాడు. లైగర్ టైంలో తన అతిశయోక్తి మాటలు చెప్పుకోదగ్గ డ్యామేజ్ చేశాయని గుర్తించాడు కాబోలు.

వీటిని సరైన రీతిలో ఎదురుకుంటే రణబాలికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ప్రీ ఇండిపెండెన్స్ సినిమాల సమస్య ఏమిటంటే జెన్ జీ బ్యాచుకి వీటి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. సైరా నరసింహారెడ్డికి సైతం చిరంజీవి ఇది ఫేస్ చేశారు. సో విజయ్ దేవరకొండకి ఈ సవాల్ ఇంకాస్త భారీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్టుగా ఇంత పెద్ద ఛాలెంజింగ్ రోల్ ఇంతకు ముందు చేయలేదు కాబట్టి, బెస్ట్ అనిపించే పెర్ఫార్మన్స్ తో పాటు అల్టిమేట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది.

ఇప్పుడు అందరి కళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఈసారి ఎలాంటి స్పీచ్ ఇస్తాడోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో దేవరకొండ జంట పర్సనల్ విషయాలు ఎక్కువ హైలైట్ కావడంతో ఈసారి టోన్ మార్చేసి సినిమా హైలైట్స్ కనిపించేలా సోషల్ మీడియాలో మైత్రి బృందం గేర్ మార్చింది. ఇది వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఓపెనింగ్స్ కి ఇబ్బంది లేదు కానీ టాక్ విషయంలోనే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. అది నిలబెట్టుకుంటే అంతా హ్యాపీసే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu